Wednesday, February 11, 2026 02:54 PM
Wednesday, February 11, 2026 02:54 PM

రంగంలోకి బన్నీ.. ఇక లీగల్ ఫైట్

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతికి కారణమయ్యారనే ఆరోపణలతో అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు జరిగిన ఓ సినిమా వేడుకలో పాల్గొన్న బన్నీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అంశం పెద్ద వైరల్ అయ్యింది. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనమామ తరఫున కాకుండా.. వైసీపీ అభ్యర్థి తరఫున నంద్యాలలో ప్రచారం చేసి మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు.

తాజాగా అల్లు అర్జున్ తీరుపై అస్సామీ నటి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. సినిమాలతో పాటు వివిధ ఉత్పత్తులకు కూడా అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే బన్నీతో షూటింగ్ అంటే అది చాలా డేంజర్ అని బ్రాండ్్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. బాబీ డియోల్, ఇంతియాజ్ లాంటి బాలీవుడ్ నటులు సైతం ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారని.. సెట్‌లో అందరితో నవ్వుతూ మాట్లాడుతారని.. వాళ్లతో షూటింగ్ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. కానీ అల్లు అర్జున్‍‌తో తన షూటింగ్ సమయంలో చాలా రూల్స్ పెట్టారన్నారు కావేరీ బారువా. బన్నీతో షూటింగ్ అంటే.. ముందుగానే తన చేతికి 42 నిబంధనలున్న రూల్ బుక్ ఇచ్చారని.. వాటికి ఒప్పుకుంటేనే షూటింగ్‌కు ఓకే అన్నారు.

Also Read : పదవుల ఆరాటమే.. విమర్శలు ఎక్కడ..? కూటమితో ఏపీ బిజేపి మైండ్ గేమ్..?

హీరోకు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, దూరంగా ఉండాలి, హీరో సెట్‌లో ఉన్న సమయంలో ఫోన్ వాడకూడదు, అసలు బన్నీ దరిదాపుల్లో కూడా కూర్చోకూడదు అనే రూల్స్ పెట్టారన్నారు కావేరీ బారువా. ఒకసారి షూటింగ్ సమయంలో సెట్‌లో ఎక్కడో మూలగా కూర్చుని ఫోన్ చూసుకుంటుంటే.. బాడీగార్డ్ వచ్చి తన ఫోన్ లాక్కున్నాడని.. “ఇక్కడ ఫోన్ వాడకూడదని తెలియదా” అంటూ గట్టిగా కేకలు వేశాడని కావేరీ బారువా వ్యాఖ్యానించారు. బహుశా హీరో ప్రైవసీకి భంగం కలుగుతుందని భయపడుతున్నారేమో.. అంటూ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ వీడియో వైరల్‌గా మారడంతో.. బన్నీ టీమ్ రంగంలోకి దిగింది.

అల్లు అర్జున్‌ టీమ్‌ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌పై ఆరోపణలు నిరాధారం, అసత్యం అని వ్యాఖ్యానించింది. తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని #AA టీమ్ హెచ్చరించింది. అల్లు అర్జున్ అందరితో గౌరవ ప్రదంగా ఉంటారని.. ఇలాంటి వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ ఇమేజ్ దెబ్బ తీయటానికి చేసేవని ప్రకటన జారీ చేసింది. మరోవైపు టీమ్ #AA క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత, పోడ్ కాస్టర్ ఆ వీడియోను డిలీట్ చేశారు. అయితే ఆ వీడియో తొలగించిన కారణం ఏంటో వివరిస్తూ ఆ పోడ్‌కాస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. అల్లు అర్జున్ పీఆర్ టీమ్ తనపై అటాక్ చేస్తుందని.. నా అతిథిని బెదిరించడం వల్లే వీడియో డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిజం చెబితే ఏం జరుగుతుందో చివరికి అర్థమైందన్నారు. ఈ విషయంపై నిజాలు మాట్లాడేందుకు ఎవరైనా ముందుకు రావచ్చొని.. వారిని ఇంటర్వ్యూ చేసేందుకు నేను రెడీ అంటూ పోడ్‌కాస్టర్ తన ఇన్‌స్టా పేజ్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read : ‘యుఫోరియా’.. సమాజానికో పాఠం..!

అయితే బన్నీ తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్‌కు చాలా పొగరని.. అందుకు ఈ వ్యవహారమే అద్దం పడుతుందంటున్నారు. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఎవర్నీ స్టేజ్ మీదకు రాకుండా కేవలం బన్నీ మాత్రమే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో నిర్మాతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన.. ఎవరైనా వస్తే.. తనని డామినేట్ చేసినట్లు అవుతుందని బన్నీ భయం అని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జగన్ కు చెన్నకేశవ...

రాజకీయాల్లో వైఎస్ జగన్ ది విలక్షణ...

స్పీకర్ సంచలన నిర్ణయం..?...

ప్రజా సమస్యల పరిష్కారానికి చట్ట సభలు...

పదవుల ఆరాటమే.. విమర్శలు...

2014 నుంచి 2019 వరకు ఏపీలో...

రాజ్యసభ సభ్యులుగా వాళ్లే...

ఏపీలో త్వరలో ఎన్నికల సందడి నెలకొననుంది....

మళ్లీ ఆ రోజే...

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల...

ఏకి పారేస్తున్న నేషనల్...

రాజకీయాలపై మీడియా ప్రభావం ఎక్కువ. ఛాన్స్...

పోల్స్