Sunday, June 21, 2026 05:03 AM
Sunday, June 21, 2026 05:03 AM

ఆరిన మెగా మంటలు.. ఆర్పేసిన బావ, బావమరిది…!

మెగా ఫ్యామిలీలో విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. దాదాపు రెండు మూడు ఏళ్ల నుంచి మెగా ఫ్యామిలీ లో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ కారణంగానే విభేదాలు వచ్చాయని చాలామంది భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీ కలవకపోతే కచ్చితంగా ఇబ్బందులు ఉంటాయని మెగా ఫాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీ నుంచి సరైన హిట్ లేదు. అల్లు అర్జున్ పుష్ప సినిమా మినహా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా ఫ్లాప్ అవుతున్నాయి.

Also Read : రాప్తాడులో మునుగుతున్న వైసీపీ నావ

ఈ టైంలో విభేదాలు ఫ్యాన్స్ ను అనవసరంగా కలవర పెడుతున్నాయనే భావన ఉంది. రామ్ చరణ్.. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఒక హిట్టు కూడా కొట్టలేదు. ఇక చిరంజీవి కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో హిట్లు లేవు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలకు ఎక్కువగా టైం కేటాయిస్తున్నారు. ఇక మిగిలిన హీరోలు ఉన్నా సరే వాళ్ళు చిన్న హీరోలే. ఇలాంటి సమయంలో సమిష్టిగా ఉండాల్సింది పోయి… అనవసరమైన విభేదాలతో మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్నారని కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : బిజెపి ఆదేశాలు.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్

ఈ టైంలో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రామ్ చరణ్ టార్గెట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారు. ఇక తాజాగా ఆయన క్షమాపణలు చెప్పారు. రామ్ చరణ్ తనకు కొడుకు లాంటివాడని.. తనకు ఏకైక మేనల్లుడని.. రామ్ చరణ్ కు కూడా తాను ఏకైక మేనమామనని కామెంట్ చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా.. పుష్ప సినిమా గురించి మొదటిసారి మాట్లాడారు. దీనితో ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లే అని ఫాన్స్ భావిస్తున్నారు. మెగా ఫ్యామిలీ కలిసి ఉన్న సమయంలో మంచి హిట్లు కొట్టింది. విడిపోయిన తర్వాత అల్లు అర్జున్ మాత్రమే సక్సెస్ అయ్యాడు. దీంతో మెగా ఫ్యామిలీ కలిసి ఉంటే కలిసి వస్తుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్