వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతల విషయంలో.. అప్పట్లో యువగళం పాదయాత్రలో.. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. బభూ అక్రమాలకు పాల్పడిన నేతలకు సంబంధించి ఆయన అప్పట్లో పలు సేల్ఫీలు కూడా దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయి. తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ బాగోతంపై సర్కార్ ఫోకస్ చేసింది.
Also Read : ఆ విషయంలో వైసీపీ బెస్ట్ అంటున్న పవన్..!
కేతిరెడ్డి భూ ఆక్రమణలపై ఎమ్మార్వోలు తప్పడు రిపోర్టులు ఇచ్చినట్లు ప్రస్తుత సిఎస్ సాయి ప్రసాద్ గుర్తించారు. వైసీపీ హయాంలో కేతిరెడ్డి భూ ఆక్రమణకు సహకరించిన ఇద్దరు ఎమ్మార్వోలకు సీఎస్ సాయిప్రసాద్ షోకాజ్ నోటీసులు జారీ చేసారు. దీనిపై 10 రోజుల్లోగా కేతిరెడ్డి వివరణ ఇవ్వాలంటూ సీఎస్ షోకాజ్ నోటీసులలో పేర్కొన్నారు. గుర్రాల కోట అక్రమాలపై లోకేష్ యువ గళం పాదయాత్రలో పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. చెరువును ఆక్రమించి విలాసాల కోసం వాడుకున్నారనే విమర్శలు వచ్చాయి.
Also Read : ఫేక్ పోస్ట్ లతో మోడీ పరువు తీస్తున్నారా..?
దీనితో ధర్మవరం చెరువును కేతిరెడ్డి ఆక్రమించారని, చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యునల్ కు తుంపర్తికి చెందిన పరమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు. దాదాపు 20 ఎకరాల చెరువును తన అవసరాల కోసం కేతిరెడ్డి ఆక్రమించి, ఫామ్ హౌస్ తో పాటుగా.. గుర్రాలకోట, బోటింగ్ నిర్మించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మార్వోగా యుగేశ్వరీదేవి తన సహాయ సహకారాలు అందించడంతో ఇష్టారీతిన కేతిరెడ్డి ఆక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిర్మించిన ఫామ్ హౌస్ సర్వే నెం. 661 లో లేదని.. సర్వే నెం. 904 లో ఉందని తప్పుడు రిపోర్ట్ ఎమ్మార్వో ఇచ్చారని, అలాగే ఆఫీస్ రికార్డులు చూడకుండా కేతిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో 2.42 ఎకరాల అసైన్డ్ భూమిని వెబ్ ల్యాండ్ లో నమోదు చేసారు ఎమ్మార్వో నీలకంఠారెడ్డి. సిఎస్ నోటీసులు ఇవ్వడంతో.. కేతిరెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దం అయినట్లు వార్తలు వస్తున్నాయి.

