Sunday, June 21, 2026 05:59 AM
Sunday, June 21, 2026 05:59 AM

అశ్విన్ విషయంలో రోహిత్ వర్సెస్ గంభీర్…?

టీమిండే మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మకు అలాగే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు మధ్య విభేదాలు తలెత్తాయా…? అంటే అవునని సమాధానం వినపడుతోంది. అశ్విన్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని గౌతమ్ గంభీర్ ఒత్తిడి చేసినట్లుగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆస్ట్రేలియా పర్యటనకు రవిచంద్రన్ అశ్విన్ ఎంపిక చేయడం పట్ల గంభీర్ అసహనంగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. పేస్ బౌలర్ ను ఆస్ట్రేలియా తీసుకువెళ్లాలని గంభీర్ పట్టుబట్టడంతో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకున్నారు.

అలాగే గంభీర్ కోరిక మేరకు హర్షిత్ రానాను కూడా తుది జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం రాబోయే రెండు టెస్టుల విషయంలో గంభీర్ చాలా సీరియస్ గా ఉండటం… అటు రోహిత్ శర్మ నాలుగు ఐదు టెస్టుల్లో అశ్విన్ ఆడించాలని పట్టుదలగా ఉండటంతో గంభీర్… రిటైర్ కావాలని అశ్విన్ కు సూచించినట్లు తెలుస్తోంది. అటు జట్టు ఎంపికలో కూడా మార్పులు చేయడానికి గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో కూడా చర్చలు జరిపాడు. అశ్విన్ తుది జట్టు నుంచి తప్పించి కొత్త ఆటగాడిని తీసుకురావాలని… ఒక యువ ఫాస్ట్ బౌలర్ పేరును కూడా ప్రతిపాదించాడట.

Also Read : కాకినాడ పోర్ట్ కేసు.. వైసీపీ నేతలకు ఉచ్చు బిగించిన ఈడీ…!

ఈ విషయంలో ఇప్పుడు రోహిత్ శర్మ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గంభీర్ వ్యవహార శైలిపై న్యూజిలాండ్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ సీరియస్ అయినట్లు ప్రచారం జరిగింది. జట్టులో మార్పులు చేసే విషయంలో రోహిత్ శర్మ కు స్వేచ్ఛ లేదని గంభీర్ పూర్తిగా అన్ని తానై వ్యవహరిస్తున్నాడని… అలాగే ఫీల్డింగ్ ప్లేస్మెంట్ విషయంలో కూడా పదేపదే జోక్యం చేసుకుంటున్నాడని… ఇక బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా గంభీర్ పెత్తనం ఎక్కువగా ఉందనే ఆగ్రహంలో రోహిత్ శర్మ ఉన్నాడని తెలుస్తోంది.

అందుకే రోహిత్ శర్మ గంభీర్ కు ప్రాధాన్యత ఇవ్వటం లేదని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ద్రావిడ్ ను మళ్లీ కోచ్ గా కొనసాగాలని అప్పట్లో రోహిత్ శర్మ కోరాడు. అయితే ద్రావిడ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కోచ్ గా గంభీర్ రావడం ఖాయం అయింది. అయితే రెండో టెస్ట్ ఓటమి విషయంలో గంభీర్ పెత్తనం ఎక్కువగా ఉంది అనే అభిప్రాయం కూడా వినపడుతోంది. లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ను తీసుకురావాలని రోహిత్ శర్మ ఒత్తిడి చేస్తున్నాడట. అందుకు గంభీర్ అంగీకరించడం లేదట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్