Tuesday, August 4, 2026 06:51 PM
Tuesday, August 4, 2026 06:51 PM

మెగా ప్లానింగ్ సూపర్… మరో స్టార్ డైరెక్టర్ ను లైన్ లో

యంగ్ హీరోలు ఏడాదికో రెండేళ్లకో ఒక సినిమా చూస్తుంటే సీనియర్ హీరోలు మాత్రం ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉంటున్నారు. అది కూడా పాన్ ఇండియా సినిమాలతో ఇప్పుడు మన తెలుగు హీరోలు చాలా బిజీగా గడుపుతున్నారు. నందమూరి బాలకృష్ణ రెండు సినిమాలతో బిజీగా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కూడా అదే రేంజిలో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇక వెంకటేష్ కూడా తక్కువ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి మరింత స్పీడ్ గా ఉన్నట్లు కనబడుతోంది.

ప్రస్తుతం విశ్వంభరా సినిమాతో చిరంజీవి బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ తో ఒక సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ చిరంజీవి నాని నిర్మాతగా సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సాహు గారపాటి నిర్మాతగా ఒక సినిమాను ప్లాన్ చేశారు. శ్రీకాంత్ సినిమా కంటే ఈ సినిమానే ముందు రానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నారు నిర్మాతలు.

Also Read : తెలుగు సినీ పరిశ్రమకు అవార్డు శాపమా…!

ఇప్పటికే కథ కూడా రెడీగా ఉండటంతో… సంక్రాంతి తర్వాత చిరంజీవి అలాగే అనిల్ రావిపూడి ఇద్దరూ ఫ్రీ అయిపోవడంతో ఆ సినిమాను గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు. విశ్వంభరా సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. మరో 20 రోజుల్లో సినిమా షూటింగ్ ఫినిష్ అయిపోయే అవకాశం కనబడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్