Saturday, September 19, 2026 11:47 AM
Saturday, September 19, 2026 11:47 AM

పవన్ ను ఆ కేసు వదలదా…?

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఓ కేసు వెంటాడుతోంది. వాలంటీర్లపై గత ప్రభుత్వంలో అనుచిత వ్యాఖ్యలు చేసారు అనే కారణంతో అప్పట్లో ఆయనపై కేసు నమోదు చేసారు. అయితే ఇప్పటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో… హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసారు ఇద్దరు మహిళా వాలంటర్లు. గత ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు కనపడకుండా పోవడానికి వారిని వ్యభిచార కూపంలోకి దించడానికి వాలంటీర్లు కారణమని పవన్ ఆరోపించారు.

అప్పటి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై కేసు నమోదుకు జీవో కూడా జారీ చేసింది. అప్పట్లో గుంటూరు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రధాన కోర్టులో కేసు దాఖలు చేయగా… కేసు దాఖలు దరిమిలా పవన్ కళ్యాణ్ కు సమన్లు కూడా జారీ చేసింది గుంటూరులోని నాలుగవ అదనపు జిల్లా కోర్టు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఏ కారణం చూపకుండా పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరించుకున్నట్టు ఆరోపణలు వినిపించాయి. విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు మాత్రమే చేయి తగిన పనిని గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు కేసు ఉపసంహరించడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.

Also Read : మరో ఐపిఎస్ కు మూడిందా…?

గుంటూరు జిల్లా కోర్టు పరిధి దాటి పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరణకు అనుమతి ఇచ్చిందని పిటీషనర్లు ఆరోపించారు. 30 వేల మంది వాలంటీర్లను అవమానపరిచిన పవన్ కళ్యాణ్ పై ఉపసంహరించుకోవడం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి అద్దం పడుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషనర్ల తరపున వినిపించనున్న ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని కేసులు ఉపసంహరించుకోవడం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు వ్యతిరేకమని పిటిషనర్లు పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్