Monday, August 17, 2026 01:28 PM
Monday, August 17, 2026 01:28 PM

మా నాన్న.. మా నాన్న కాదు.. మనోజ్ సంచలన ప్రెస్ మీట్

గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతోన్న మంచు కుటుంబ వివాదంలో నిన్న కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మంచు మనోజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేసాడు. నాన్న అంటే నాకు ప్రాణం..మా నాన్న దేవుడు అంటూ మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారన్నాడు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువు గా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేసాడు. నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టామన్నాడు.

Also Read: ఎవరీ వినయ్…? సాక్షి టూ మోహన్ బాబు యూనివర్సిటీ

వాటికి కూడా అడ్డంకులు సృష్టించారని ఆరోపించాడు. నా పై దాడులు చేశారు..మా నాన్న ముందే నన్ను కొట్టారన్నాడు. నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మ ను కూడా డైవర్ట్ చేశారని మూడు రోజులు బయటకు వెళ్ళు, మనోజ్ కి సర్ధిచెప్తాం అని మా అమ్మను కూడా నమ్మించారన్నాడు మనోజ్. విచారణకు వెళ్లడానికి జల్‌పల్లి ఇంటి నుంచి బయటకు వచ్చిన మనోజ్‌… అదే సమయంలో జర్నలిస్టులకు మద్దతు తెలిపాడు. మోహన్‌ బాబు డౌన్‌ డౌన్‌ అంటూ జర్నలిస్ట్‌ లు నినాదాలు చేయడంతో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Also Read: కృష్ణయ్య కు రాజ్యసభ అభ్యర్ధిత్వం వెనుక బిజెపి భారీ వ్యూహం

నాన్న తరుఫున నేను క్షమాపణ కోరుతున్నానన్న మనోజ్… నా కోసం వచ్చిన మీకు ఇలా జరగడం నికు బాధగా ఉందన్నాడు. నేను ఇంట్లో ఎలాంటి డబ్బు, ఆస్తీ అడగలేదని నాభార్య 7 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు.. బాధలు అనుభవించిందని తెలిపాడు. నా బంధువులపై దాడి చేశారని… ఇన్నాళ్లు ఆగాను, ఇక ఆగలేనని స్పష్టం చేసాడు. అన్ని విషయాలు సాయంత్రం చెబుతానని, మా నాన్న దేవుడు, ఇలా ఉండేవారు కాదన్నాడు. ఈ నాన్న మా నాన్న కాదని మీడియా సమావేశం ముగించాడు. అక్కడి నుంచి రాచకొండ కమిషనరేట్‌కు బయల్దేరి వెళ్ళాడు మంచు మనోజ్‌.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

ఇంటింటికి తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

భోగాపురంలో ల్యాండ్ అయిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ...

నోటీసులకు జవాబు ఇవ్వాలి.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల...

బ్యాలెట్ విధానంలోనే స్థానిక...

ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు...

కృష్ణా జలాల వాటాపై...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన...

పోల్స్