Saturday, September 19, 2026 10:45 AM
Saturday, September 19, 2026 10:45 AM

కృష్ణయ్య కు రాజ్యసభ అభ్యర్ధిత్వం వెనుక బిజెపి భారీ వ్యూహం

తెలంగాణ రాజకీయాల పై ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టడం ఏమో గాని, ఓ రాజ్యసభ సీటు విషయంలో మాత్రం పెద్ద రచ్చ లాంటి చర్చ జరుగుతోంది. తెలంగాణలో దాదాపు ఏడాది నుంచి బీసీ ఉద్యమం చాప కింద నీరులా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బిజెపి ఓ తెలంగాణ నాయకుడిని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపడం పట్ల పెద్ద చర్చ జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపిలో జాయిన్ అయిన ఆర్ కృష్ణయ్యను మరోసారి రాజ్యసభకు పంపించేందుకు బిజెపి సిద్దమైనది.. అది కూడా ఏపి కోటాలో.

Also Read: ఇంకా లేట్ వద్దు… పిలిచేద్దాం అంటున్న టీడీపీ అధిష్టానం

ఈ మేరకు అధికారిక ప్రకటన చేయడమే కాకుండా ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే దీని వెనుక భారతీయ జనతా పార్టీ పెద్దల వ్యూహం భారీగానే ఉన్నట్లుగా కనపడుతోంది. తెలంగాణలో బీసీలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని బిజెపి కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి కూడా బీసీ సామాజిక వర్గాల్లో మంచి పట్టు ఉండటంతో ఆ పార్టీకి కూడా తెలంగాణలో ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కృష్ణయ్యను తెలంగాణ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టి అవకాశం కూడా ఉండవచ్చు అంటున్నారు.

Also Read: ఎవరీ వినయ్…? సాక్షి టూ మోహన్ బాబు యూనివర్సిటీ

ఆయనతో రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేయించి బీసీ ఉద్యమాన్ని మరింతగా లేపే ప్రయత్నం బిజెపి పెద్దలు చేయవచ్చని అంచనాలు వినపడుతున్నాయి. రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బలంగా కనపడుతుంది. అయితే గులాబీ పార్టీ మాత్రం క్రమంగా బలహీనపడుతున్న సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారా రారా అనే ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. ఈ తరుణంలో ఉన్న అవకాశాలను వాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ పెద్దలు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ఆర్.కృష్ణయ్య ద్వారా తమ పార్టీని బలోపేతం చేసేందుకు గ్రౌండ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. అందుకే వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే ఆయనను భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని రాజ్యసభ సీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు బిజెపి పెద్దలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

పోల్స్