Wednesday, May 6, 2026 10:22 PM
Wednesday, May 6, 2026 10:22 PM

వారికి పదవులు ఉన్నట్లా… లేనట్లా…?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొంతమంది నేతల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. అసలు తమ పరిస్థితి ఏమిటనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమను అధినేత గుర్తిస్తారా లేదా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే… తమ తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం పట్ల… కొత్త ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతున్నారు. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు టీడీపీ నేతలు. ఇక కొందరు నేతలనైతే తప్పుడు కేసుల్లో అరెస్టులు కూడా చేశారు. మహిళా నేతల పరిస్థితి అయితే దారుణం. మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో నానా దుర్భాషలాడారు కూడా. అయినా సరే… నాటి ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాటం చేశారు.

Also Read : కొడుకు కోసం మెట్టు దిగుతున్న కాపు నేత…!

పొత్తులో భాగంగా, గెలుపు ఓటముల లెక్కల్లో కొంతమంది సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్లు కేటాయించలేదు చంద్రబాబు. అదే సమయంలో పార్టీ కోసం పనిచేసిన నేతలకు కూడా పదవులిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావొస్తోంది. టీటీడీ పాలకమండలి సహా కీలక పదవులన్నీ కూడా దాదాపు పూర్తి చేశారు. కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్‌లను కూడా నియమించారు. అయితే కొందరు నేతలకు మాత్రం అసలు పదవులు ఉన్నాయా… లేవా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. సీనియర్ నేతలు దేవినేని ఉమా, గల్లా జయదేవ్‌, పిఠాపురం వర్మ, కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి, డా.ప్రవీణ్‌ కుమార్ రెడ్డి, ఆచంట సునీత, ప్రొ.తిరునగరి జ్యోత్స్న వంటి నేతలకు ఇప్పటికీ ఎలాంటి పదవులు రాలేదు.

Also Read : రైల్వే స్టేషన్ సెట్.. వణికిపోతున్న కండల వీరుడు

వాస్తవానికి ఎన్నికలప్పుడే ఒక్కొక్కరికి ఒక్కో పదవి వస్తుందని అంతా భావించారు. కానీ ఆయా పదవులన్నీ ఇప్పుడు ఇతరులకు కేటాయించేశారు చంద్రబాబు. ఆర్టీసీ ఛైర్మన్‌గా దేవినేని, ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ప్రవీణ్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌కు కలమట పేరు వినిపించాయి. అలాగే గల్లా, జ్యోత్స్న పేర్లు జాతీయ పదవులకు, వర్మకు ఎమ్మెల్సీ అని జోరుగా ప్రచారం నడిచింది. మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ పదవికి ఆచంట సునీత పేరు బాగా ప్రచారంలో ఉంది. అయితే వీటిల్లో దాదాపు అన్ని పదవులు ఇప్పటికే పూర్తి చేశారు చంద్రబాబు. దీంతో అసలు వీరికి పదవులు వస్తాయా… రావా… అనే అనుమానం ఇప్పుడు అటు పార్టీలో.. ఇటు కార్యకర్తల్లో వినిపిస్తోంది. పార్టీ కోసం ఇంతగా కష్టపడిన తమను చంద్రబాబు ఎందుకు గుర్తించలేదని కొందరు నేతలు మదన పడుతున్నారు కూడా.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్