ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు మన తెలుగు సినిమాను శాసిస్తున్నాయి. పాన్ ఇండియా పేరుతో వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ నిర్మాతలు దూకుడు పెంచారు. స్టార్ హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా అనే మంత్రాన్ని నమ్ముకుని అడుగులు వేస్తున్నారు. బాహుబలి ఈ ట్రెండ్ సెట్ చేయగా… ఇప్పుడు స్టార్ హీరోలు, చిన్న హీరోలు అందరూ అదే ఫాలో అవుతున్నారు. ఇటీవల విడుదలైన దేవర సినిమా కూడా అలాగే హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా తెలుగు తర్వాత కన్నడం, తమిళంలో బాగా ఆడిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు పుష్ప 2 మాత్రం కన్నడంలో అంతగా ప్రభావం చూపే ఛాన్స్ లేదు అంటున్నాయి సినీ వర్గాలు. కారణం లోకల్ ఫీలింగ్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన పుష్ప టీం సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అక్కడి వరకు ఓకే గాని… కన్నడలో రిలీజ్ చేసే అక్కడి నిర్మాతలు మాత్రం సినిమాను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తామని, కేజిఎఫ్, కాంతారా సినిమాల రికార్డులు బద్దలు కొడతామని చెప్పారు. ఆ కామెంట్ అక్కడి జనాల్లో కోపాన్ని పెంచింది. అసలే తెలుగు సినిమా డామినేషన్ పీక్స్ లో ఉందని వాళ్లకు అసహనంగా ఉంది. గతంలో రాజ్ కుమార్ బ్రతికి ఉన్న సమయంలో కన్నడంలో తెలుగు సినిమాలను బ్యాన్ చేసారు. ఆయన మరణం తర్వాత నిషేధం ఎత్తేసారు.
Also Read: వార్ 2 లో ఊహించని బిగ్ ట్విస్ట్ లు
ఇప్పుడు మళ్ళీ ఆ నిషేధం దిశగా అడుగులు పడతాయనే వార్నింగ్ వస్తోంది. చిన్న చిన్న విషయాల్లో కూడా లోకల్ ఫీలింగ్ చూపిస్తూ ఉంటారు. అలాంటిది కన్నడ సినిమా స్థాయి పెంచి, పాన్ ఇండియా సినిమాల్లో తమ మార్క్ చూపించేందుకు రూట్ క్లియర్ చేసిన కాంతారా, కేజిఎఫ్ సినిమాల రికార్డులను బద్దలు కొట్టడం ఏంటీ, అసలు కన్నడ సినిమాలను తెలుగు సినిమా డామినేట్ చేసేలా రిలీజ్ చేయడం ఏంటీ అంటూ సీరియస్ అవుతున్నారు అక్కడి ప్రజలు. మరి పుష్ప 2 కన్నడ వెర్షన్ ను ఆదరిస్తారో లేదో చూడాలి. ఇటీవల విడుదలైన రజనీ కాంత్ వేట్టాయన్ సినిమా… టైటిల్ కన్నడలో లేదని సినిమాను అక్కడ ఆదరించలేదు. మరి పుష్ప పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

