వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బెంగళూరుకు మకాం మార్చిన ఆయన, అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారన్న విమర్శ ఇప్పటికే ఉంది. ఈ క్రమంలో ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి రావడం మంగళవారంతో వందోసారి కావడం గమనార్హం. దీంతో జగన్ సెంచరీ కొట్టారంటూ సెటైర్లు పేలుతున్నాయి.
Also Read : గుడివాడలో హైటెన్షన్.. వైసీపీ శిబిరానికి ఒంటరిగా బైక్‌పై ఎమ్మెల్యే..!
2024 తర్వాత బెంగళూరునే తన కేంద్రంగా మార్చుకున్న జగన్, అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు, రాజకీయ వ్యవహారాలను నడిపిస్తున్నారు. వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఆయన తాడేపల్లికి వచ్చి వెళుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకుల ఇళ్లలో జరిగే వివాహాలు, పరామర్శలకు హాజరయ్యేందుకు రాష్ట్రానికి వచ్చినప్పుడు తాడేపల్లి నివాసంలో బస చేస్తున్నారు. ఆ సమయంలోనే క్యాంపు కార్యాలయంలో అడపాదడపా పార్టీ నేతలతో సమావేశాలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
గత అక్టోబరులో జరిగిన ఆయన పర్యటన తీరు దీనికి ఓ ఉదాహరణ. ఆ రోజు ఉదయాన్నే బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకుని ప్రెస్‌మీట్ నిర్వహించిన జగన్, మధ్యాహ్నం విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. సాయంత్రం గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఇలా ఒకే రోజులో కీలక కార్యక్రమాలు ముగించుకుని, తెల్లవారగానే తిరిగి బెంగళూరు విమానం ఎక్కేశారు.
Also Read : విజయ్ కు చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యేలు..!
ప్రధాన ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి ఇలా అతిథిలా వచ్చి వెళ్లడంపై మిగతా పార్టీలు, రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. బెంగళూరు-తాడేపల్లి మధ్య సాగుతున్న ఈ గెస్ట్ అప్పియరెన్స్ పాలిటిక్స్‌లో మంగళవారం నాటి పర్యటనతో సెంచరీ మార్కును దాటడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


