Wednesday, November 25, 2026 06:11 PM
Wednesday, November 25, 2026 06:11 PM

గుడివాడలో హైటెన్షన్.. వైసీపీ శిబిరానికి ఒంటరిగా బైక్‌పై ఎమ్మెల్యే..!

కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అనూహ్య రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. గుడివాడ పట్టణంలోని 28వ వార్డు పరిధిలో గల విలీన గ్రామం బొమ్ములూరులో కూటమి అభ్యర్థుల తరఫున స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, వైసీపీ తరఫున మాజీ మంత్రి కొడాలి నాని సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల రోడ్ షోలు ఎదురుపడటంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also Read : ఇదేం బాదుడు రా బాబు.. వైభవ్ భీభత్సం..!

షెడ్యూల్ ప్రకారం కూటమి శ్రేణులు ప్రధాన రహదారిపై రోడ్ షో నిర్వహిస్తుండగా, క్రాస్ రోడ్డు నుంచి వచ్చిన వైసీపీ ప్రచార బృందం అటువైపు రావడంతో గొడవలు జరగకుండా సంయమనం పాటించాలని ఎమ్మెల్యే రాము ఇరువర్గాలకు సూచించారు. అయితే, ఆ సమయంలో వైసీపీ ప్రచార వాహనంపై ఉన్న కొందరు కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్త చేతిలో ఉన్న టీడీపీ జెండాను బలవంతంగా లాక్కొని కింద పడేసి కాళ్లతో తొక్కారంటూ తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, తన అనుచరగణాన్ని పక్కన పెట్టి ఎలాంటి భద్రత లేకుండా ఒంటరిగా ద్విచక్ర వాహనంపై నేరుగా వైసీపీ ప్రచారం జరుగుతున్న ప్రాంతానికి చేరుకోవడం స్థానికంగా సంచలనం రేపింది.

అక్కడ ప్రచారంలో ఉన్న వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్‌ను నేరుగా కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్ర స్థాయిలో నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో ఎవరి పని వారు చేసుకోవాలి తప్ప ఇలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు. ర్యాలీ సమయంలో రోడ్డుపై వైసీపీ జెండా పడిపోతే తమ కార్యకర్తలతో తీయించి గౌరవంగా తిరిగి ఇచ్చేలా చూశానని, కానీ తల్లిలా, దైవంలా భావించే తమ పార్టీ జెండాను కాలితో తొక్కడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని ఆయన స్పష్టం చేశారు. జెండా తొక్కిన వారిని వెంటనే అక్కడికి పిలిపించాలని డిమాండ్ చేశారు.

Also Read: యలహంక ఆస్తులు.. వివేకా హత్య.. రెండింటికీ లింక్ ఉందా?

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆగ్రహంతో నిలదీయడంతో వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్, ఇతర నాయకులు దిగొచ్చారు. తమ పార్టీ కార్యకర్తలు చేసిన ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామని, దీనిని సీరియస్‌గా తీసుకోవద్దని కోరుతూ వారి తరఫున బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. వైసీపీ నేతల క్షమాపణతో అక్కడ నెలకొన్న ఉద్రిక్తత సద్దుమణిగింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

భారీగా పెరిగిన ఏపీ...

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సరికొత్త మైలురాయిని...

జగన్‌పై హరీష్‌రావుకు కోపం...

పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇప్పుడు...

సంచలన చట్టానికి సిద్ధమైన...

ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలకు కూటమి...

10 లక్షల మందితో...

‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని ఆచరణలోకి...

కోర్టు విచారణల రికార్డింగ్...

న్యాయస్థానాల విచారణ ప్రక్రియకు సంబంధించి ఏపీ...

టీడీపీ ఎమ్మెల్యేలకు కొత్త...

ఏపీలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల...

పోల్స్