Tuesday, November 24, 2026 05:30 PM
Tuesday, November 24, 2026 05:30 PM

నాలుగు మేయర్ కుర్చీలు.. గెలిచేవి ఇవేనా..!

ఏపీలో నాలుగు మేయర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో రెండింటికి తొలిసారి ఎన్నికలు జరుగుతుండగా.. మిగిలిన రెండు కూడా పాతవే. ఓ వైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం.. ఈ నాలుగు మేయర్ స్థానాలపైనే ఉందది. ఇందుకు ప్రధాన కారణం ఈ ఎన్నికలు జరుగుతున్న తీరే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి ముందుగా రాష్ట్రంలోని 13 మేయర్ స్థానాలకు ఎన్నికలు జరిగినప్పటికీ.. వాటిల్లో ఒకటి రెండు స్థానాలు మాత్రమే హాట్ టాపిక్‌గా మారాయి. ప్రధానంగా విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కడప మేయర్ స్థానాల పైనే అందరూ ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న నాలుగు స్థానాల పైన అందరు దృష్టి పెట్టారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిల్లో ఎవరు గెలుస్తారనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాలుగు స్థానాల్లో రెండు జనసేన అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. ఒక చోట బీజేపీ, ఒక చోట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు. దీంతో ప్రస్తుత ఎన్నికలు అటు జనసేనతో పాటు కూటమి పార్టీలో నేతల మధ్య సమన్వయానికి కూడా పెద్ద పరీక్షగా కనిపిస్తోంది. అందుకో ఈ నాలుగు మేయర్ స్థానాల్లో గెలుపు ఓటములు ఎవరిని వరిస్తాయనే చర్చ జోరుగా జరుగుతోంది.

Also Read : రెచ్చిపోయిన ఉక్రెయిన్.. రష్యా యుద్ధనౌకను పేల్చేసింది..!

ప్రస్తుతం జరుగుతున్న నాలుగు మేయర్ స్థానాల్లో మంగళగిరి – తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నిక గురించి పెద్దగా చర్చించుకోవటం లేదనే చెప్పాలి. మొదటి సారి ఎన్నిక జరుగుతున్నప్పటికీ.. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. మంగళగిరి – తాడేపల్లి మేయర్ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తుండటం ఇక్కడ మరో ప్లస్ పాయింట్ కూడా. తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న పేరం ఏడుకొండలును మేయర్ అభ్యర్థిగా లోకేష్ ప్రకటించడంతోనే ఇక్కడ సగం గెలుపు ఖాయమైంది. ఏడుకొండలు గెలుపు నల్లేరు మీద నడక అంటున్నారు పరిశీలకులు. ఇందుకు ప్రధానంగా మంగళగిరిలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. తాడేపల్లిలో జగన్ ఇల్లు ఉన్నప్పటికీ.. ఇక్కడ ఉండకపోవడం వల్ల వైసీపీ గట్టి పోటీ కూడా ఇవ్వలేక పోతోంది. ఇంకా చెప్పాలంటే.. వైసీపీ అభ్యర్థి పేరు కూడా చాలా మందికి తెలియదు.

రాజమండ్రి మేయర్ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. అక్కడ నుంచి బీజేపీ తరఫున రేలంగి శ్రీదేవి పోటీ చేస్తుండగా.. వైసీపీ తరఫున దసి వెంకట్రావు బరిలో ఉన్నారు. ఇక్కడ రేలంగి శ్రీదేవి గెలుపు బాధ్యతను బీజేపీ ఎంపీ పురందేశ్వరి భుజానెత్తుకున్నారు. రాజమండ్రిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కూడా. అయితే ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బుచ్చయ్య చౌదరి మాత్రం.. కేవలం కార్పొరేటర్ల గెలుపు పైనే దృష్టి పెట్టారనే మాట బాగా వినిపిస్తోంది. దీంతో మేయర్ అభ్యర్థి గెలుపులో క్రాస్ ఓటింగ్ ఖాయమంటున్నారు పరిశీలకులు. అలా జరిగితే మాత్రం వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయమంటున్నారు.

కాకినాడ, శ్రీకాకుళం మేయర్ స్థానాలను జనసేన పార్టీకి కేటాయించారు. ఈ రెండు స్థానాల్లో కాకినాడ గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవటం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. అక్కడ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా జనసేన పార్టీ అభ్యర్థులే. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కలిసి ఎన్నికల బాధ్యతలు చూస్తున్నారు. మేయర్ అభ్యర్థి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. కాకినాడ కూటమి నేతల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి.. ఇక్కడి ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసే పని చేస్తున్నారు. కాబట్టి జనసేన అభ్యర్థి ఆకుల భవానీ గెలుపు ఖాయమంటున్నారు కూడా.

Also Read : నాకేం సంబంధం లేదు.. మాట మార్చిన కేంద్ర మంత్రి..!

ఇక శ్రీకాకుళం మేయర్ స్థానం మాత్రం.. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకోవడంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైసీపీ తరఫున, దానేటి రాధారాణి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. లక్ష్మీదేవికి సానుభూతి పవనాలు గట్టిగానే వీస్తున్నాయి. దీంతో రాధారాణి గెలుపు కోసం కింజరాపు బాబాయ్, అబ్బాయ్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే ఈ ఎన్నికల సమయంలోనే టీడీపీ ఎమ్మెల్యే గోండు శంకర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. దీంతో ఇక్కడ కూడా కార్పొరేటర్లుగా టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కానీ మేయర్‌గా మాత్రం.. వైసీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ వల్లనే శ్రీకాకుళం, రాజమండ్రి స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఫేస్‌బుక్ నుంచి పబ్‌జీ...

భారత సైన్యంలో సోషల్ మీడియా, మొబైల్...

యలహంక ఆస్తులు.. వివేకా...

బెంగళూరులోని యలహంక పరిధిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి...

రహదారి భద్రతలో ఏపీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళగిరి కేంద్రంగా ఏర్పాటు...

నాకేం సంబంధం లేదు.....

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్...

ఆస్ట్రేలియా మరో బాల్...

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మరోసారి బాల్...

ఆసియా పవర్ ఇండెక్స్...

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ మేధో...

పోల్స్