‘ఇది ఖచ్చితంగా నవ్వుల జాతర కాబోతోంది’ అంటూ కొత్త సినిమాను ప్రకటించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు తారక్. ‘మరో అదుర్స్ లోడింగ్’ అంటూ అభిమానుల సందడి. ‘అదుర్స్’లో చారి ఓ మాట అనడానికి ముందు ఇచ్చే చిన్న విరామం కూడా నవ్వించేది. ఆ టైమింగ్‌తోనే ఎన్టీఆర్ ఆ పాత్రను ప్రేక్షకులకు అంత దగ్గర చేశారు. ఆ తర్వాత భారీ యాక్షన్ చిత్రాలతో అలరించిన తారక్, ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆయన కామెడీ టైమింగ్‌కు తోడవుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ కలయికను ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Also Read : వెండితెర పై చెరగని ముద్ర.. నటుడు గిరిబాబు కన్నుమూత
‘నవ్వుల జాతర’ అంటూ తారక్ పోస్ట్
‘ఇది ఖచ్చితంగా ఒక నవ్వుల జాతర కాబోతోంది’ అంటూ ఎన్టీఆర్ తన పోస్ట్‌లో అనిల్ రావిపూడిని ట్యాగ్ చేశారు. దానికి #NTRxAnilRavipudi హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. అదే పోస్ట్‌లో తన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్‌ను కూడా ట్యాగ్ చేయడంతో, ఈ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది. నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Also Read : జగన్ చెప్పినా వినను.. బొత్సా హాట్ కామెంట్స్..!
తారక్ టైమింగ్‌కు అనిల్ రావిపూడి మార్క్
అనిల్ రావిపూడి సినిమాల్లో పాత్రలు ఒకదానికొకటి ఇచ్చే పంచ్‌లతోనే సన్నివేశం పండుతుంది. ఎన్టీఆర్‌కి ఒక్క చూపుతోనో, డైలాగ్ పలికే తీరుతోనో నవ్వించే టైమింగ్ ఉంది. ఈ ఇద్దరూ కలిస్తే తారక్ కోసం అనిల్ ఎలాంటి పాత్ర రాస్తారన్నదే ఆసక్తికరం. ప్రకటన వెలువడగానే అభిమానుల కామెంట్లలో ‘మరో అదుర్స్ లోడింగ్’ అన్న మాట వినిపించడానికి కారణమూ అదే. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది? షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఈ ప్రశ్నలకు తదుపరి అప్‌డేట్లలో సమాధానం రానుంది. అప్పటివరకు అభిమానుల చర్చల్లో మాత్రం చారి మళ్లీ సందడి చేస్తున్నాడు.


