మహిళల్లో పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందు కడుపు ఉబ్బరం లేదా పొత్తికడుపులో భారంగా అనిపించడం చాలా సాధారణమైన విషయం. హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల శరీరంలో నీరు చేరడం, జీర్ణక్రియ మందగించడం ఇందుకు ప్రధాన కారణాలు. సాధారణంగా పీరియడ్స్ ప్రారంభమైన ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ ఉబ్బరం దానంతట అదే తగ్గిపోతుంది. అయితే, ప్రతీ సమస్యను కేవలం హార్మోన్ల మార్పులేనని నిర్లక్ష్యం చేయడం సరికాదని, కొన్ని రకాల ఉబ్బరాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చునని ప్రముఖ గైనకాలజిస్ట్లు హెచ్చరిస్తున్నారు.
Also Read : లోకేష్ కు పవన్ అభినందనలు.. విశాఖలో ఇంట్రస్టింగ్ సీన్..!
మహిళలు ఖచ్చితంగా గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు ఒకసారి చూస్తే.. కడుపు ఉబ్బరం లేదా వాపు చాలా వారాల పాటు నిరంతరంగా వేధిస్తుంటే దానిని సాధారణ పీరియడ్ సమస్యగా అస్సలు భావించకూడదు. పీరియడ్స్ డేట్స్‌తో ఎటువంటి సంబంధం లేకుండా, ఎప్పుడు పడితే అప్పుడు కడుపు ఉబ్బరంగా, అసౌకర్యంగా అనిపించడంతో పాటుగా.. ఉబ్బరంతో పాటు నిరంతర మలబద్ధకం, విరేచనాలు, లేదా విపరీతమైన గ్యాస్ సమస్య వేధించడం మంచిది కాదు.
అదే విధంగా కడుపు ఉబ్బరంతో పాటు పొత్తికడుపు భాగంలో తీవ్రమైన నొప్పి, ఒత్తిడి లేదా ఒక రకమైన అసౌకర్యం కలగడం వంటి లక్షణాలను లైట్ తీసుకోవద్దు అని హెచ్చరిస్తున్నారు. కొద్దిగా ఆహారం తినగానే కడుపు నిండినట్లు అనిపించడం, ఆకలి పూర్తిగా చచ్చిపోవడం, లేదా ఎలాంటి ప్రయత్నం చేయకుండానే హఠాత్తుగా బరువు తగ్గిపోవడం వంటివి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పీరియడ్స్ సైకిల్‌ను ఫాలో అవ్వని నిరంతర ఉబ్బరం వెనుక జీర్ణకోశ సమస్యలు, పీసీఓడీ, గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు లేదా అరుదైన సందర్భాలలో ఓవేరియన్ సమస్యలు వంటి వివిధ రకాల కారణాలు ఉండే అవకాశం ఉంది.
Also Read : వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్..!
కాబట్టి ఇంట్లోనే సొంత వైద్యాలు చేసుకుంటూ కాలయాపన చేయడం వల్ల అసలు సమస్యను గుర్తించడం ఆలస్యమవుతుంది. మీ శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ, పైన పేర్కొన్న ఏ ఒక్క లక్షణం పదే పదే కనిపిస్తున్నా వెంటనే గైనకాలజిస్ట్‌ను కలిసి సమగ్రమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఏదైనా ఆరోగ్య సమస్యలో సరైన సమాచారాన్ని ఫిజికల్ లేబుల్స్ లేదా మెడికల్ రిపోర్ట్స్ ద్వారా క్రాస్ చెక్ చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం అని సూచిస్తున్నారు.


