అప్పుడు వైసీపీ ఓటమికి, వైసీపీ రెడ్లు, సాక్షి మీడియా యాంకర్లు, వైసీపీ జర్నలిస్ట్ లే కారణం కాగా.. ఇప్పుడు వైసీపీ ఓటమికి రప్పా.. రప్పా.. అంటూ పలువురు వైసీపీ నేతలు చేసిన కామెంట్లే కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 ఎన్నికల్లో ఘోరంగా వైసీపీ ఓడిపోయి అధికారం కోల్పోయింది. అయితే రెండున్నరేళ్ల తర్వాత పార్టీ పరిస్థితి కాస్త మెరుగైంది అని అంతా అనుకున్నారు. కానీ అదంతా నీటి బుడగే అని స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలిపోయింది. 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరమైన ఓటమి వెనుక వైసీపీ అభిమానులు, కార్యకర్తలు చేసిన ఆధారాలు లేని విమర్శలు, ఆరోపణలతో పాటు.. రప్పా.. రప్పా.. అంటూ చేతులతో యాక్షన్ చేస్తూ సోషల్ మీడియాలో అతిగా చేసిన కామెంట్లే కారణమన్న ప్రచారం జరుగుతోంది.
Also Read : షర్మిల ఔట్.. ఏపీ పీసీసీ చీఫ్‌గా ఆమంచి ..?
జగన్ మోహన్ రెడ్డితో సహా ఒక్క వైసీపీ రెడ్డి నేత కూడా నిజాలు మాట్లాడటం లేదు. ప్రభుత్వంలో ఏమేమి జరుగుతుందో.. ఎవరెవరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారో టీడీపీ అనుకూల మీడియా కూడా ఆధారాలతో కధనాలు ప్రచురిస్తుంది. అయినా సరే.. వైసీపీ నేతలు మాత్రం అవేవి పట్టించుకోకుండా.. నిత్యం చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేయటం మాత్రమే కొంతమంది వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారు. వారు మాట్లాడే బాష, ఆధారాలు లేని విమర్శలు చేస్తున్న తీరు తటస్త ఓటర్లకు, వైసీపీ అభిమానులకు, ఆ పార్టీ కార్యకర్తలకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లకు కూడా నచ్చలేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంతమంది మహిళలు చేసే కామెంట్లు కూడా మెజారిటీ ఓటర్లకు అసహ్యం కలిగించాయి.
అటు వైసీపీ రెడ్లు.. ఇటు వైసీపీ మహిళలు, వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేసే చిల్లర వ్యాఖ్యలు మేధావులకు కూడా అసహ్యం కలిగించాయి. ముఖ్యంగా రాయలసీమకు చెందిన ఇద్దరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు చేసిన విమర్శలు వైసీపీ రెడ్డి సామాజిక వర్గం నేతలు, కార్యకర్తలకే అసహ్యం కలిగించాయనేది వాస్తవం. ఈ మధ్యకాలంలో వైసీపీ కమ్మ కులం అని చెప్పుకునే మహిళలు చేస్తున్న కామెంట్లపై మెజారిటీ ఓటర్లకు మింగుడు పడలేదు.
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాయలసీమ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మహిళా మాజీ మంత్రి, వైసీపీ కాపు కులం మాజీ మంత్రులు, అటు సోషల్ మీడియాలో, ఇటు ఇతర మీడియాలలో మాట్లాడే తీరు, వైసీపీకి కావాల్సినంత నష్టం కలిగించాయి. అప్పుడు మూడు రాజధానులు ముంచగా.. ఇప్పుడు మావిగన్ రాజధాని నినాదం కూడా వైసీపీని నిలువునా ముంచేసింది. జగన్ మోహన్ రెడ్డిని అప్పుడు ఎవరెవరైతే రాజకీయంగా ముంచారో.. ఇప్పుడు కూడా వారే, వైసీపీని నిండా ముంచారన్నది వాస్తవం. అంతే కాదు సాక్షి మీడియాలో పనిచేస్తున్న టీవీ యాంకర్లు, పాత్రికేయులు కూడా జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టారు.
Also Read : పెట్రోల్ బంకులలో కొత్త మోసం.. పెట్రోల్‌కు బదులు నీళ్లు..!
సాక్షి టీవీ ఛానల్లో నిజాలు చెప్పరు, నిజాలు మాట్లాడరు.. నిత్యం జగన్‌ను పొగడటం, చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు, ఆరోపణలు, వ్యంగ్య కామెంట్లు చేస్తుంటారు. ఈ విషయం ఎవరైనా ఐదు నిమిషాలు సాక్షి మీడియా చూస్తే తెలిసిపోతుంది. దీంతో దీనిని ప్రజలతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా అసహ్యించుకునే పరిస్థితి. వైసీపీ అభిమాన మీడియాతో పాటు ఆ పార్టీ ప్యాకేజి మీడియా కూడా జగన్‌ను నిండా ముంచాయనేది వైసీపీ అభిమాన రాజకీయ విశ్లేషకులే ఆఫ్ ధి రికార్డుగా కామెంట్లు చేస్తున్నారు.


