Friday, November 6, 2026 05:00 PM
Friday, November 6, 2026 05:00 PM

అనంతపురంలో ఏం జరుగుతోంది.. బాబు ఫైర్..!

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే అనంతపురం కార్పొరేషన్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి విజయం సాధించడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లలో 12 చోట్ల కూటమి గెలవగా, అనంతపురంలో మాత్రమే వైసీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ మేయర్ పీఠం దక్కించుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించిన ఈ స్థానంలో ఓటమికి కారణాలపై చంద్రబాబు నేతల నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. టీడీపీకి కంచుకోట వంటి అనంతపురంలో వైసీపీ విజయం దక్కించుకోవడం వింతగా ఉంది.

Also Read : ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.. ఈడీ సంచలన ప్రకటన..!

నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే.. 12 చోట్ల కూటమి పార్టీలు విజయం దక్కించుకున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన పోటీ చేసిన కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో వందశాతం దక్కించుకున్నాయి. చివరికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప మేయర్ సీటు కూడా కూటమి ఖాతాలోకే చేరింది. ఇక విశాఖ, విజయవాడ మేయర్ అభ్యర్థులు అయితే లక్షల్లో మెజారిటీ సాధించి ఘన విజయం సాధించారు. కానీ, అనంతపురం విషయానికి వస్తే.. ఇక్కడ వైసీపీ గెలిచింది. దీంతో అసలు అక్కడ ఏం జరిగింది..? అనే విషయం పై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల సరళి, అక్కడ జరిగిన రాజకీయ ఘర్షణలు.. వంటివి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చాయి, కానీ, అనూహ్యంగా ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రమేష్ గౌడ్ మేయర్ పీఠం ఎక్కనున్నారు. అయితే.. వాస్తవానికి ఈ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో టీడీపీ వర్గాలు, జనసేన కార్యకర్తలను కలసి కట్టుగా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కానీ, ఎన్నికల అనంతరం.. ఇక్కడ వైసీపీ గెలుపు గుర్రం ఎక్కడంతో కూటమి నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా నడుస్తున్నప్పటికీ, అనంతపురం కార్పొరేషన్ పరిధిలో మాత్రం వైసీపీ గెలవడం, అది కూడా.. 2024 ఎన్నికల్లో కూటమి క్లీన్ స్పీప్ చేసిన జిల్లాలో.. కూటమికి గట్టి మద్దతు ఉన్న కార్పొరేషన్‌లో ఇలా జరగడం వంటి అంశాలపై చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఎన్నికల లెక్కింపులో రౌండ్ రౌండ్‌కు సమీకరణాలు మారుతుండం, వైసీపీ గట్టి పోటీ ఇవ్వడంతో, అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే విషయంపై పార్టీ నేతలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంపై నివేదిక వచ్చాక.. బీజేపీ విషయంలో చంద్రబాబు సానుకూల దృక్పథంతోనే ఉన్నారు.

Also Read : కేంద్ర ఎన్నికల సంఘంలో సంచలన పరిణామాలు..!

అయితే.. ఈ ఎన్నికల్లో బీజేపీ కోరిన విధంగానే స్థానాల కేటాయింపుతో పాటు తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి పూర్తిస్థాయి సహకారం కూడా అందించారు. అందుకే గతంలో కనీస ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ.. మేయర్ ఎన్నికల్లో గణనీయమైన ఓటు బ్యాంకు సాధించింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. తాజా ఎన్నికల్లో కమలం మరింత వికసిస్తోంది కూడా. కానీ కీలకమైన కార్పొరేషన్ స్థానంలో బీజేపీ ఓడిపోవడం.. అది కూడా 6 వేల పై చిలుకు ఓట్ల తేడాతో పరాజయం వంటి అంశాలపై చంద్రబాబు ఆరా తీస్తున్నారు. అనంత స్థానిక నేతల సహకారం, వ్యవహారం, అనే విషయాలతో పాటు అనంతలో నేతల తీరుపై కూడా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పార్టీ నేతలను ఆదేశించారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత.. బాధ్యులపై పార్టీ పరంగా చర్యలు తప్పవనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

అసెంబ్లీ కంటే ఘోరం.....

ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు...

ఓటర్లకు ఈసీ బిగ్...

ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన...

పోలవరం ఇప్పట్లో కష్టమేనా..?...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు...

గుంటూరులో అర్ధరాత్రి హైడ్రామా.....

గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద స్థానిక...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

రెబల్స్ దెబ్బ.. మరి...

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఘట్టం...

పోల్స్