Tuesday, November 3, 2026 06:49 PM
Tuesday, November 3, 2026 06:49 PM

బొత్స వారసురాలికి షాక్ తప్పదా..?

సినిమాల్లో, రాజకీయాల్లో వారసులు సక్సెస్ కావడం ఈ మధ్య కాలంలో కాస్త కష్టంగానే ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లో బలమైన ఫ్యామిలీల వారసులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఇదే పరిస్థితి విజయనగరం జిల్లాలో కనపడుతోంది. మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బొత్సా అనూషను ఇటీవల విజయనగరం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను టీడీపీలోకి అడుగుపెట్టిన తర్వాత, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ వైసీపీ అధిష్టానం నియమించింది.

Also Read : మళ్లీ యాత్రల సమయం.. ఇక రెడీ..!

ఆ తర్వాత బొత్సా అనూష అనూహ్యంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండల జెడ్పీటీసీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. ఇక్కడ టీడీపీ నుంచి జెన్ జీ.. పాశల నీరజను బరిలోకి దించింది పార్టీ నాయకత్వం. వాస్తవానికి ముందు గెలుస్తామనే ఆశలుపెట్టుకున్న బొత్సా ఫ్యామిలీ, క్రమంగా గ్రామాల్లో పట్టు కోల్పోయింది. టీడీపీ నాయకత్వం దూకుడు, పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో వైసీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మాజీ ఎమ్మెల్యే, తన బాబాయి బొత్సా అప్పలనరసయ్యపై ఉన్న వ్యతిరేకత కూడా అనూషకు తలనొప్పిగా మారింది.

Also Read : మావిగన్ ఫలితాలు.. మడత పెట్టాయి కదా..!

ఇక బొత్సా అనూష ప్రచారం కూడా పెద్దగా నిర్వహించలేకపోవడం, బొత్సా ఫ్యామిలీ పట్టుకోల్పోవడంతో అనుకున్న స్థాయిలో వాతావరణం కనపడటం లేదనే మాట వినపడుతోంది. ఇక నాన్ లోకల్ అంశం కూడా బొత్సా అనూషకు మైనస్ గా మారింది. రేపు ఆమె గెలిచినా మండలంలో ఉండరు అనే అభిప్రాయం గ్రామాల్లో బలపడటంతో వైసీపీ నేతలు కూడా కాడి వదిలేసారు. భీమిలి ఇంచార్జ్ పదవికి ఆమె రాజీనామా చేయలేరు అని, చేస్తే వైసీపీ అధిష్టానం వద్ద ప్రతికూల వాతావరణం ఎదురు అవుతుందనే భయం కూడా బొత్సా ఫ్యామిలీలో ఉందనే మాట వినపడుతుంది. ఇక దీనికి తోడు టీడీపీ జిల్లా నాయకత్వం రంగంలోకి దిగి ప్రచారం చేయడం కూడా వైసీపీకి మైనస్ గా మారింది. ఇలా బొత్సా వారసురాలికి తొలి ప్రయత్నంలోనే షాక్ తప్పదు అంటున్నాయి జిల్లా వర్గాలు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మావిగన్ ఫలితాలు.. మడత...

అనుకున్నంత అయ్యింది.. మునిసిపల్ ఫలితాలు వెలువడ్డాయి....

పాతికేళ్ళ తర్వాత మాచెర్ల...

పల్నాడు జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మాచర్ల...

కూటమి క్లీన్ స్వీప్.....

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అందరూ...

పులివెందుల కోట బద్దలు...

వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన,...

బ్రేకింగ్: బెజవాడకు వరద...

మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షం...

సీఎం చంద్రబాబుకు అమిత్...

ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుపాన్లు వణికిస్తున్న నేపథ్యంలో...

పోల్స్