వాళ్లిద్దరూ దుమ్ము రేపారు.. దాదాపు ఓటమి అంచున నిలిచిన మ్యాచ్‌ను గెలిపించారు. 112 రన్స్ వద్ద ఆరు వికెట్లు కోల్పోయిన దశలో ఈ ఇద్దరు కలిశారు. చేతులో ఉన్న ది 5 ఓవర్లు.. 31 బంతుల్లో 69 రన్స్ చేయాలి. సొంత మైదానం కాదు.. వీళ్లు ఓట్ అయితే తర్వాత వచ్చే ముగ్గురు అంతగా ఆడే పరిస్థితి లేదు. ఎదురుగా కొండంత టార్గెట్.. మిగిలింది ఈ ఇద్దరే.. కానీ భయపడలేదు.. నిలబడ్డారు.. ఆడారు.. చివరి బంతి వరకు ఆడారు.. మరుపురాని విజయాన్ని జట్టుకు అందించారు. అంతే కాదు.. సిరీస్ గెలుచుకునేందుకు మరో అడుగు దూరంలో జట్టును నిలిపారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరి గురించే చర్చ జోరుగా జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే.. గొప్పగా మాట్లాడుకుంటున్నారు కూడా.
Also Read : ఉమ్మడి ఆస్తిని నాది అనడం.. షర్మిలకి అన్యాయం చేయడం కాదా?
చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. చివరి బాల్‌కు సిక్సర్ కొట్టి జట్టును గెలిపించిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఐసీసీ ట్రోఫీల్లో కూడా ఎన్నో మర్చిపోలేని మ్యాచ్‌లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండియా మొత్తం.. ఇంకా చెప్పాలంటే.. తెలుగు వారు గర్వంగా చెప్పుకునే మ్యాచ్ మాత్రం భారత్ – న్యూజీలాండ్ మధ్య జరిగిన రెండో టీ 20 మ్యాచ్. ఈ మ్యాచ్ గెలుపు కంటే కూడా.. ఇద్దరు తెలుగు వాళ్లు గెలిపించారనే మాట సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. అదే సమయంలో వారిద్దరి సంభాషణ పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఇంకా చెప్పాలంటే.. తెలుగు వారు గర్వించేలా ఉంది.
Also Read : బాక్సాఫీస్ ను దున్నేస్తున్న సీనియర్ హీరోలు..!
తిలక్ వర్మ – నువ్వు కాల్ ఇవ్వలేదు..
నితీష్ కుమార్ రెడ్డి – నువ్వు వచ్చేసేయ్ నేను వచ్చేస్తా ఆరాంసే
తిలక్ వర్మ – రేయ్ రెండు అని చెప్పురా పోనీ
ఈ మూడు ముక్కలు.. ప్రతి తెలుగు వాడిని గర్వపడేలా చేశాయి. ఎందుకంటే.. ఇదేదో ఇద్దరు ఫ్రెండ్స్ సరదా సంభాషణ కాదు. ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో గెలుస్తామా.. ఓడిపోతామా.. అని అంతా భయపడుతున్న సమయంలో.. స్టేడియంలో వేల మంది మధ్య నిలబడి.. చక్కటి తెలుగులో ఇలా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎంత బాగుందో కదా.. అనేలా ఈ ఇద్దరి సంభాషణ సాగింది. “ఇదిరా తెలుగోడి పవర్.. ఇతర దేశాల్లో ఆడుతున్నప్పుడు కూడా తెలుగు మాట్లాడుతున్నప్పుడు గర్వంగా ఉంటుంది.” అని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు దినేష్ కార్తీక్, అశ్విన్ గతంలో తమిళంలో మాట్లాడారు. అంతకు ముందు ద్రావిడ్, కుంబ్లే కన్నడలో మాట్లాడుకున్నారు. కానీ ఇలా తెలుగులో మాత్రం.. వీళ్లిద్దరే మాట్లాడారు.
నిజానికి తెలుగు వారికి అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా తక్కువ అవకాశాలే వచ్చాయనేది వాస్తవం. అజారుద్దీన్.. ఒక్కసారి కూడా తెలుగులో మాట్లాడలేదు. వెంకటపతి రాజు, ఎంఎస్‌కే ప్రసాద్, వీవీఎస్ లక్ష్మణ్.. వీరంతా ఒంటరిగానే ఆడారు. కానీ ఇలా.. ఇన్నాళ్ళకు ముఖ్యమైన స్థానంలో మనోళ్ళు ఇద్దరూ ఆడటం భలే హాయిగా ఉంది. పైగా వారిద్దరు తెలుగులో మాట్లాడటం మరీ సంతోషంగా ఉందంటున్నారు. ప్రతి తెలుగు వాడు గర్వపడేలా తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఆడి చూపించారని కితాబిస్తున్నారు.


