Wednesday, October 7, 2026 05:00 PM
Wednesday, October 7, 2026 05:00 PM

విజయనగరంలో వైసీపీ మెయిన్ వికెట్ డౌన్.. ఇప్పుడు జనసేన వంతు..!

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విజయనగరం జిల్లాలో శరవేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత జిల్లాలో వైసీపీ తీవ్ర నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు వరుసగా వైసీపీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా వైసీపీకి చెందిన అత్యంత సీనియర్ నేత, మాజీ మంత్రి కోలగట్ల వీరభద్రస్వామి కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

Also Read : ఇస్లాంపై డోనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్..!

ఆయన త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ జెండా కప్పుకోనున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో.. వైసీపీని వీడిన నేతలందరూ తెలుగుదేశం పార్టీలో చేరడానికే మొగ్గు చూపారు. నిన్నటి వరకు కూడా టీడీపీలో చేరికల హడావుడి విపరీతంగా సాగింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారాయి.

టీడీపీలో ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పాత, కొత్త నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉండటం, సీట్ల సర్దుబాటులో ఇబ్బందులు ఎదురవుతుండటంతో.. వలస నేతల చూపు ఇప్పుడు జనసేన పార్టీ వైపు మళ్లింది. కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఇదే వ్యూహంతో టీడీపీని కాదని, జనసేన వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన జనసేన పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలతో అత్యంత రహస్యంగా మంతనాలు జరిపినట్లు నమ్మదగిన వర్గాల సమాచారం.

Also Read : మిషన్ 2027 వరల్డ్ కప్.. వన్డేల్లోకి కూడా భువీ రీ-ఎంట్రీ..?

విజయనగరం జిల్లాలో బలమైన సామాజిక వర్గ ఓటు బ్యాంకు, అనుభవం ఉన్న కోలగట్ల.. నామమాత్రంగా కాకుండా జనసేన పార్టీలో జిల్లా స్థాయిలో అత్యంత కీలకమైన బాధ్యతలు చేపట్టే యోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కోలగట్ల లాంటి గట్టి నేత జనసేనలోకి వస్తే జిల్లాలో పార్టీకి తిరుగుండదని పవన్ కళ్యాణ్ అనుచరులు కూడా భావిస్తున్నారు. నిన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న కోలగట్ల.. ఈ రహస్య భేటీలతో విజయనగరం కూటమి రాజకీయాల్లో సరికొత్త హీట్ పెంచారు. ఈ చేరిక అధికారికంగా ఎప్పుడు ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పిఠాపురంలో ఏం జరుగుతోంది..?...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత...

ఇస్లాంపై డోనాల్డ్ ట్రంప్...

ఫ్రాన్స్‌లో విద్యా వసతులు, ఉపాధ్యాయుల కొరత...

అందరి దృష్టి అక్టోబర్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై...

నవంబర్ నుంచి పెన్షన్‌లో...

ఏపీలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్‌ తగ్గుతుందా..?...

మిషన్ 2027 వరల్డ్...

భారత క్రికెట్ జట్టులోకి దాదాపు నాలుగేళ్ల...

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో...

పోల్స్