Tuesday, October 6, 2026 11:19 PM
Tuesday, October 6, 2026 11:19 PM

రాహుల్ వర్సెస్ ఈసీ.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..!

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా, ఆన్‌లైన్ ఫామ్-6లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా మార్పులు చేశారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఆరోపణలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి అని ఈసీఐ స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X వేదికగా ఎన్నికల సంఘం ఈ ఆరోపణలపై ఫ్యాక్ట్-చెక్ పోస్ట్ పెట్టింది.

Also Read : అమరావతిలో కేటీఆర్ టీమ్‌ భారీ పెట్టుబడులు..?

2025 జూన్ 24న బీహార్‌లో ప్రారంభించిన ఈ ‘SIR’ ప్రక్రియకు సంబంధించిన ఆర్డర్.. కమిషన్ యొక్క ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగిందని తెలిపింది. అంతేకాకుండా, ఈ నిర్ణయాన్ని 2026 మే 27 నాటి తీర్పులో గౌరవ సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని ఎన్నికల సంఘం గుర్తు చేసింది. ఎన్నికల సంఘం వివరణ ఇచ్చినప్పటికీ, ఈ వివాదానికి సంబంధించిన ప్రధాన అంశంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. మొదటిసారి ఓటరుగా నమోదు చేసుకునే పౌరులు ఉపయోగించే ఈ ఫామ్-6 లో.. “తాము లేదా తమ తల్లిదండ్రులు గత సవరణలో మ్యాప్ చేయబడ్డారా..?” అనే కొత్త నిబంధనను ఆన్‌లైన్ ఫామ్‌లో చేర్చారు.

Also Read : రాయలసీమలో చంద్రబాబు మార్క్.. డ్రిప్‌ ఇరిగేషన్‌ నుంచి హార్టీకల్చర్ హబ్‌ వరకు

ఇలా మార్పులు చేసిన ఫామ్-6 కు తాము ఎలాంటి ఆమోదం తెలపలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. “మేము ఎలాంటి మోడిఫైడ్ ఫామ్-6 ను ఆమోదించలేదు. అసలు ఈ మార్పులు ఎవరు చేశారో అధికారిక రికార్డులను తెప్పించి పరిశీలిస్తాం” అని సీజేఐ పేర్కొన్నారు. ఈ ఫామ్-6 మార్పులపై సీఈసీ జ్ఞానేష్ కుమార్‌తో పాటు ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు, అసలు ఈ మార్పుల వెనుక ఎవరున్నారనే రికార్డులను పరిశీలించబోతుండటంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై...

పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను...

భారత క్రికెట్ లో...

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత...

చంద్రబాబు ఢిల్లీ టూర్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర...

విజయనగరం టీడీపీలో విచిత్ర...

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అత్యంత...

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

పోల్స్