Wednesday, October 7, 2026 04:14 AM
Wednesday, October 7, 2026 04:14 AM

టీమిండియాలోకి స్టార్ పేసర్ రీ-ఎంట్రీ..!

న్యూజిలాండ్ పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ సుదీర్ఘ పర్యటన కోసం సెలెక్టర్లు త్వరలోనే మూడు వేర్వేరు భారత జట్లను ప్రకటించనున్నారు. అయితే ఈ పర్యటనలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ఏమిటంటే.. టెస్ట్ జట్టులోకి ఒక స్టార్ ఫాస్ట్ బౌలర్ గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతుండటం. అయితే ఆ బౌలర్ మహమ్మద్ షమీనో, భువనేశ్వర్ కుమారో కాదు.. అతనే స్పీడ్‌స్టర్ ఆకాశ్ దీప్.

Also Read : అలెర్ట్.. ప్రపంచానికి పొంచి ఉన్న భారీ ముప్పు..!

లోయర్ బ్యాక్ స్ట్రెస్ ఇంజ్యూరీ కారణంగా గత ఏడు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న 29 ఏళ్ల ఆకాశ్ దీప్, డొమెస్టిక్ క్రికెట్‌లో సంచలన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇటీవల జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో దాదాపు 24 ఓవర్లు బౌలింగ్ చేసి, రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 68 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ప్రస్తుతం అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, సగటున 138 నుండి 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడని బోర్డు వర్గాలు తెలిపాయి. ‘ఆకాశ్ దీప్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని, అతను జాతీయ జట్టులోకి పునరాగమనం చేయబోతున్నాడని’ టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటికే రెస్ట్ ఆఫ్ ఇండియా కోచింగ్ స్టాఫ్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Also Read : వెదురుపావులూరు టోల్ గేట్ రగడ వెనుక అసలు నిజాలివే..!

ఈ పర్యటనలో భాగంగా వన్డే, టెస్ట్ సిరీస్‌ల మధ్య కేవలం నాలుగు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. ప్రయాణానికి ఒక రోజు పోగా, ప్రాక్టీస్ కోసం కేవలం మూడు రోజులు మాత్రమే సమయం దొరుకుతుంది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కె.ఎల్. రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు రెండు ఫార్మాట్లలోనూ ఉండటంతో, టెస్టుల కోసం వీరికి విశ్రాంతినిచ్చే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ చివరి రెండు వన్డే మ్యాచ్‌ల నుంచి రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ తప్పుకుంటే.. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై...

పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను...

భారత క్రికెట్ లో...

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత...

చంద్రబాబు ఢిల్లీ టూర్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర...

విజయనగరం టీడీపీలో విచిత్ర...

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అత్యంత...

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

పోల్స్