Monday, October 5, 2026 04:47 PM
Monday, October 5, 2026 04:47 PM

అలెర్ట్.. ప్రపంచానికి పొంచి ఉన్న భారీ ముప్పు..!

ప్రపంచ దేశాలను మరోసారి మహమ్మారి భయం పట్టుకుంది. గతంలో కోట్లాది మంది ప్రాణాలు తీసిన భయంకరమైన ప్లేగు వ్యాధి ఇప్పుడు రష్యాలో కలకలం రేపుతోంది. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న ఒక యాంటీప్లేగ్ రీసెర్చ్ ల్యాబ్‌లో జరిగిన ప్రమాదం కారణంగా అత్యంత ప్రమాదకరమైన న్యుమోనిక్ ప్లేగు వ్యాధి బయటకు వ్యాపించినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందిన సమాచారం ప్రకారం.. ల్యాబ్‌లో పరిశోధనలు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్లేగు బ్యాక్టీరియా కలిగిన ఒక టెస్ట్‌ట్యూబ్ పగిలిపోయింది.

Also Read : ఫ్లై దుబాయ్ విమాన ఘటన విచారణలో భయంకర నిజాలు..!

ఈ ప్రమాదంలో ల్యాబ్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి ఈ భయంకరమైన వ్యాధి సోకింది. తీవ్రమైన న్యూమోనియా బారిన పడిన ఆ ఉద్యోగి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనతో రష్యా ఆరోగ్య శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ న్యుమోనిక్ ప్లేగు వ్యాధి అత్యంత ప్రమాదకరమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది గాలి ద్వారా ఒకరి నుండి ఒకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన 24 గంటల్లోగా రోగికి సరైన చికిత్స లేదా యాంటీబయాటిక్స్ అందకపోతే మరణం సంభవించడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు.

Also Read : బొత్సను ఒంటరిని చేస్తున్న మేనల్లుడు..!

బాధితుడి ఊపిరితిత్తులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఈ ప్రమాదం బయటపడిన వెంటనే రష్యా ప్రభుత్వం సైబీరియాలో అత్యవసర చర్యలు చేపట్టింది. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గానూ ఆ ప్రాంతంలోని ఐదు ప్రధాన ఆసుపత్రులను పూర్తిగా క్వారంటైన్ జోన్‌గా మార్చేశారు. మరణించిన ల్యాబ్ ఉద్యోగితో ప్రాథమికంగా కాంటాక్ట్ అయిన సుమారు 200 మంది స్థానికులను మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ప్లేగు వ్యాధి భయాలు మొదలయ్యాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

అంబటి ఓవరాక్షన్.. పోలీసుల...

దివంగత కాపు ఉద్యమ నేత, మాజీ...

బొత్సను ఒంటరిని చేస్తున్న...

ఉత్తరాంధ్ర రాజకీయ ఖిల్లా విజయనగరం జిల్లా...

అన్నదమ్ములకు అసలైన పరీక్ష..!

సాధారణంగా ఒకే పార్టీలోనే ఇద్దరు నాయకుల...

పవన్, లోకేష్ మధ్య...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

లోకల్ వార్.. రంగంలోకి...

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను...

జగన్‌ చేతిలో 40...

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హత్యకు...

పోల్స్