దుబాయ్-టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో కాక్‌పిట్‌లోనే కెప్టెన్‌పై గొడ్డలితో దాడి జరిగిన ఘటనలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్ హమామ్ అల్ హమామీ, దర్యాప్తు అధికారుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో ఉన్న ఒక పెద్ద భవనాన్ని ఈ విమానంతో బలంగా ఢీకొట్టి, భారీ ఎత్తున ప్రాణనష్టం కలిగించడమే తన అసలు లక్ష్యమని అతడు వెల్లడించినట్లు సమాచారం.
Also Read : లోకల్ వార్.. రంగంలోకి లోకేష్..!
ఈ భయంకరమైన కుట్రను అమలు చేయడానికి కో-పైలట్ హమామీ విమానం గాల్లో ఉండగానే అత్యవసర గొడ్డలితో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఆపై విమానాన్ని క్రాష్ చేసేందుకు వీలుగా ఇంజిన్లను కూడా ఆపేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే తీవ్రంగా గాయపడినప్పటికీ భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసాధారణ సాహసంతో పోరాటం చేయడంతో.. ప్రయాణికులు క్షేమంగా ల్యాండ్ అయ్యారు. చివరి నిమిషం వరకు పోరాడి విమానంపై నియంత్రణ కోల్పోకుండా అడ్డుకోవడంతో కో-పైలట్ ప్లాన్ విఫలమైంది.
Also Read : చంద్రబాబు పై అంబానీ ఫ్యామిలీకి ప్రత్యేక అభిమానం
అనంతరం కాక్‌పిట్ తలుపులు తెరుచుకోవడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు కలిసి నిందితుడిని బంధించారు. ఈ హమామీ గతంలో జులై నెలలో కూడా ఒకసారి విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రణాళికలు వేసినట్లు విచారణలో తేలింది. దీని కోసం తాను ఓ విమానాన్ని కూడా దొంగాలించాలి అని ప్లాన్ చేసుకున్నట్లు విచారణలో గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు యూఏఈ అధికారుల అదుపులో ఉండగా, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ చాకచక్యంపై అంతర్జాతీయంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.


