ఏపీ సీఎం చంద్రబాబుపై పారిశ్రామికవేత్తలు.. ఆపారమైన గౌరవ, మర్యాదలు చూపిస్తారు. ఆయన అనుసరించే పారదర్శకమైన పద్దతులు, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీల కారణంగానే బిజినెస్ సర్కిల్స్‌లో బాబుగారికి అంత వెయిటేజ్ ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద వ్యాపార కుటుంబాల్లో ఒకటైన అంబానీ ఫ్యామిలీకి చంద్రబాబు అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన మాటకు అంబానీ కుటుంబం అత్యంత విలువ ఇస్తుంది.
Also Read : లోకల్ వార్.. రంగంలోకి లోకేష్..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ఒక సందర్భంలో ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశారు. రియలన్స్ వ్యవస్థాపక ఛైర్మన్, తన తండ్రి.. ధీరూబాయ్ అంబానీ కాలం నుంచే.. తమ కుటుంబానికి సీఎం చంద్రబాబుతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ధీరూభాయ్ అంబానీకి ఎన్టీఆర్‌తోనూ సాన్నిహిత్యం ఉందని తెలిపారు. 1990వ దశకంలో రిలయన్స్ సంస్థ టెలికాం రంగంలోకి అడుగుపెట్టడానికి.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సలహానే కారణమని.. ముఖేశ్ అంబానీ చెప్పారు.
ఆ రోజుల్లో టెలికాం రంగంలో సంస్కరణలు తీసుకురావాలని.. అప్పటి ప్రధాని వాజ్‌పేయికి తాను ఇచ్చిన సలహాతోనే మొబైల్ ఫోన్ రివల్యూషన్ వచ్చిందని.. సీఎం చంద్రబాబు చెబుతూ ఉంటారు. ఈ అంశంపై ప్రత్యర్ధులు వెటకారాలు చేయడం కూడా అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు వల్లనే అప్పట్లో రియలన్స్ సెల్యులార్ కంపెనీ ప్రారంభమైందని స్వయంగా ముఖేశ్ అంబానీ చెప్పడంతో.. ఈ వెటకారం బ్యాచ్‌కి నోళ్లకు తాళాలు వేసినట్లయింది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, ఫైవ్ జీ నెట్‌వర్క్ వాడుతున్న వారంతా.. ఈ అధునాతన టెక్నాలజీకి పునాదులు వేసిన వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒకరని గుర్తించాల్సిన అవసరం ఉంది.
Also Read : నాడు ISB, నల్సార్.. ఇప్పుడు ISA.. ఉన్నత విద్యారంగంలో చంద్రబాబు విజన్
బాబుగారి మీద నమ్మకంతోనే రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తోంది. తనను ఆంధ్ర బిడ్డగా భావించి.. రాష్ట్ర అభివృధ్ధి కోసం ఏం చేయాలో చెప్పమని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ అన్నారంటే.. అంబానీ కుటుంబానికి చంద్రబాబుపై ఎంత విశ్వాసం.. ఎంత గౌరవం ఉన్నదో తెలుస్తుంది. పారిశ్రామికవేత్తలను వెంటపడి తరిమేసిన పాలకులకు.. పెట్టుబడులు తీసుకొచ్చే విజనరీ లీడర్‌కి ఎంత తేడా ఉంటుందో అంబానీ కుటుంబంతో చంద్రబాబు అనుబంధం చూస్తే అర్ధమవుతుంది.

