Thursday, October 1, 2026 02:38 PM
Thursday, October 1, 2026 02:38 PM

ఎస్ఐఆర్ పై బాంబు పేల్చిన పరకాల ప్రభాకర్..!

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త డాక్టర్ పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ‘SIR’ ప్రక్రియను ఆయన ఒక “రక్తం చిందని రాజకీయ నరమేధం” గా అభివర్ణించారు. కేవలం తప్పులు సరిదిద్దే పేరుతో క్షేత్రస్థాయిలో కోట్లాది మంది పౌరుల ప్రాథమిక ఓటు హక్కును తుడిచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు.

Also Read : నారా లోకేష్ ధైర్యానికి ఫిదా అయిన రాజ్‌దీప్ సర్దేశాయ్..!

పరకాల ప్రభాకర్ వెల్లడించిన అధికారిక విశ్లేషణల ప్రకారం, ఇప్పటివరకు జరిగిన ‘SIR’ ప్రక్రియలో దేశవ్యాప్తంగా 6.5 కోట్ల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించారు. అయితే ఈ ప్రక్రియ పూర్తిగా ముగిసే సమయానికి దేశంలో ఏకంగా 16.50 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామనడం కేవలం ఒక అపోహ మాత్రమేనని.. క్షేత్రస్థాయిలో బతికున్న వారిని, అర్హులైన పౌరులను కూడా ఓటర్ల లిస్ట్ నుండి అక్రమంగా తొలగిస్తున్నారని తమిళనాడు, బీహార్, కేరళ వంటి రాష్ట్రాల గణాంకాలను ఉటంకిస్తూ ఆయన స్పష్టం చేశారు.

Also Read : ఏపీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు..!

ఈ భారీ ఓట్ల తొలగింపు వెనుక కేవలం ఎన్నికల ప్రయోజనాలే కాకుండా ఒక లోతైన, ప్రమాదకరమైన వ్యూహం దాగి ఉందనే సరికొత్త యాంగిల్‌ను పరకాల ప్రభాకర్ తెరపైకి తెచ్చారు. కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాలను, బలహీన వర్గాలను మరియు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దేశ రాజకీయ సమాజం నుండి వారిని పూర్తిగా వేరు చేసే ప్రక్రియగా ‘SIR’ మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులకు దేశ రాజకీయాల్లో పాల్గొనే పాత్ర, అర్హత లేకుండా చేస్తూ.. ఇది భవిష్యత్తులో కేవలం కొద్దిమందికి మాత్రమే పరిమితమైన డెమోక్రసీ ఆఫ్ ది ఫ్యూకు దారితీస్తోందని, దీనిపై రాజకీయ పార్టీలు మరియు ప్రజలు తక్షణమే స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నారా లోకేష్ ధైర్యానికి...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా...

ఏపీ స్థానిక ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతోన్న స్థానిక సంస్థల...

ఆ పిల్లాడి బాధ్యత...

గొర్రెలు కాస్తున్న ఒక చిన్నారి దయనీయ...

విశాఖ మెట్రోకు గ్రీన్...

ఏపీలో విశాఖ అతి పెద్ద నగరం....

కొత్త ఓటర్లకు గుడ్...

దేశంలో నూతన ఓటర్ల నమోదు ప్రక్రియను...

జగన్‌ను జైల్లో పెట్టిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న...

పోల్స్