Wednesday, September 30, 2026 05:11 PM
Wednesday, September 30, 2026 05:11 PM

జగన్‌ను జైల్లో పెట్టిన పార్టీతో పొత్తా..? సిగ్గుండాలి..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు క్షేత్రస్థాయిలో సరికొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత సరికొత్త రాజకీయ ప్రయోగాల దిశగా అడుగులు వేస్తోన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అటు టీడీపీ, ఇటు వైఎస్‌ఆర్‌సీపీ రెండు పార్టీల అధినేతల కుటుంబ కేంద్రీకృత రాజకీయాలపై ఆయన నిప్పులు చెరిగారు.

Also Read : ఏపీ మద్యం స్కామ్‌లో బిగ్ ట్విస్ట్..!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ సరళిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. “జగన్ గతంలో ఒకలా మాట్లాడి, ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకుని మావిగన్ అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు” అని ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్రంలో మావిగన్ లేదు.. మాయదారి గన్ లేదు అంటూ సెటైర్లు వేశారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా ఉత్తరాంధ్రను రాజధాని చేస్తామని మాట తప్పినందుకు గాను వైఎస్ జగన్ ఇక్కడి ప్రజలకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read : దుబాయ్ విమానం హైజాక్..? అసలేం జరిగింది..?

ఇండియా కూటమి వేదికగా వైఎస్‌ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతోందనే తాజా ప్రచారాలపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. “రాష్ట్ర విభజనతో పాటు దేశ విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీతో వైఎస్‌ఆర్‌సీపీ పొత్తుకు సిద్ధమవ్వడం అత్యంత సిగ్గుచేటు” అని విమర్శించారు. గతంలో జగన్‌ను 16 నెలల పాటు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీతోనే, ఇప్పుడు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేయి కలపాలని అనుకోవడం ఏ రకమైన రాజకీయమని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు కుటుంబ పార్టీల స్వార్థం వల్ల గత 12 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్కటంటే ఒక్క గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ కూడా రాలేదని, వీరు సాధించింది కేవలం నిరుద్యోగమేనని మండిపడ్డారు. తాను అమరావతిని ఏమాత్రం వ్యతిరేకించడం లేదని స్పష్టం చేసిన ఆయన.. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాజధానిని మార్చాలని అనుకోవడం అత్యంత అవివేకమైన చర్య అని అభివర్ణించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విశాఖ మెట్రోకు గ్రీన్...

ఏపీలో విశాఖ అతి పెద్ద నగరం....

కొత్త ఓటర్లకు గుడ్...

దేశంలో నూతన ఓటర్ల నమోదు ప్రక్రియను...

కుమార్తె పెళ్లి తర్వాతే...

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

దుబాయ్ విమానం హైజాక్..?...

దుబాయ్ నుండి ఇజ్రాయెల్ రాజధాని టెల్...

కాపులపై ప్రేమ కాదు,...

సాక్షి మీడియా రోజు రోజుకూ దిగజారుతోంది....

ఏపీ మద్యం స్కామ్‌లో...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్సార్‌సీపీ హయాం...

పోల్స్