Tuesday, September 22, 2026 07:45 PM
Tuesday, September 22, 2026 07:45 PM

తప్పు చేసి కొత్త డ్రామాకు తెరలేపిన జగన్‌..?

బెజవాడలో టీచర్లపై చేసిన దాడిని, తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి మరో కొత్త డ్రామాకు తెరలేపారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ అభ్యర్థులు, స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు పాల్పడిన దాడిలో తమ తప్పు లేదని బుకాయించే ప్రయత్నం మొదలుపెట్టింది వైసీపీ. పూర్తిగా జగన్ మార్క్ రాజకీయ కపట నాటకానికి వైసీపీ తెరలేపినట్లు తెలుస్తోంది.

Also Read : కూతురు పెళ్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే ఖర్మ లేదు..!

మెగా డీఎస్సీ ద్వారా స్పోర్ట్స్ కోటాలో అర్హత సాధించిన ఉపాధ్యాయులు తమ పత్రాలు, మెడల్స్ అన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయని నిరూపించుకోవడానికి, సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించేందుకు శాప్ కార్యాలయానికి వచ్చిన సంగతి తెలిసిందే. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, చెమటోడ్చి సంపాదించిన తమ ప్రతిభను రాజకీయ లబ్ధి కోసం తప్పుపట్టవద్దని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ వినతి పత్రం ఇచ్చేందుకు విజయవాడ రాగా.. వైసీపీ నాయకులు మాత్రం ఉద్దేశపూర్వకంగా అక్కడకు చేరుకుని, అభం శుభం తెలియని ఉపాధ్యాయులపై భౌతిక దాడికి దిగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Also Read : గులాబీ కోటలే రేవంత్ టార్గెట్..!

స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ మూకలు, రౌడీషీటర్లు దాడికి పాల్పడి రాద్ధాంతం సృష్టించినా, చివరికి ఎదురుదాడి జరిగిందంటూ మళ్లీ విక్టిమ్ కార్డ్ ప్లే చేసేందుకు జగన్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. తామే స్వయంగా గొడవకు తెరలేపి, ఇప్పుడు అసత్యాలతో కూడిన ఫొటోలు, వీడియోలను అడ్డంపెట్టుకుని గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు జగన్ సిద్ధమవ్వడం ప్రజలను మరోసారి మోసం చేసే యత్నమేనని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు. సొంత పార్టీ మూకలతో గొడవలు సృష్టించి, ఆపై ఎదురుసొద్దులు చెప్పడం జగన్‌కు అలవాటుగా మారిందని కూటమి నాయకులు మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జగన్‌కు ఊహించని షాక్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

టాలీవుడ్ కు ఏపీ...

తెలుగు చలనచిత్ర మరియు టెలివిజన్ రంగాలకు...

కూతురు పెళ్లిని అడ్డుపెట్టుకుని...

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా...

గులాబీ కోటలే రేవంత్...

తెలంగాణ రాజకీయ రంగంలో ఇప్పుడు ఉత్కంఠ...

టీడీపీ కార్యకర్తలకు పవన్...

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న...

కళ్లెదుటే టీచర్లపై దాడి...

విజయవాడ నగరంలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్...

పోల్స్