Friday, November 6, 2026 02:43 PM
Friday, November 6, 2026 02:43 PM

వైసీపీ నేతలపై క్రిమినల్ కేసు.. సర్కార్ కీలక నిర్ణయం..!

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ ఉపాధ్యాయులపై జరిగిన భౌతిక దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నడిరోడ్డుపై ఉపాధ్యాయుల పట్ల దౌర్జన్యానికి దిగి, బూతులు తిడుతూ రెచ్చిపోయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయుల రక్షణకు భంగం కలిగించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన దాడికోరులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దంటూ పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టమైన, కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.

Also Read : ఎర్రవల్లిలో ఊపందుకున్న భూముల సర్వే..!

ప్రభుత్వ ఆదేశాలతో అలర్ట్ అయిన విజయవాడ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దాడి ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న మరియు దీని వెనుక ఉండి నడిపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో పాటు, రంగంలోకి దిగిన రౌడీషీటర్లపై పోలీసులు విడివిడిగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసుకుంటున్న ఉపాధ్యాయులపై రౌడీయిజం చేయడంపై చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా సెక్షన్లను నమోదు చేసినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఈ అంశంపై హోం మంత్రిని వివరణ కోరినట్లు తెలుస్తోంది.

Also Read : టీవీ9లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న రవి ప్రకాష్..?

ఇక ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో, దాడికి పాల్పడిన అరాచక శక్తులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. శాప్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను, అలాగే అక్కడ సేకరించిన వీడియో ఆధారాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఫుటేజ్ ఆధారంగా దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ గుర్తిస్తూ, వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పోలవరం ఇప్పట్లో కష్టమేనా..?...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు...

గుంటూరులో అర్ధరాత్రి హైడ్రామా.....

గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద స్థానిక...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

రెబల్స్ దెబ్బ.. మరి...

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఘట్టం...

ఓటమి నేర్పిన గుణపాఠం...

అధికారం కోల్పోయిన రాజకీయ పార్టీకి ప్రజల్లో...

ఇది కదా కావాల్సింది.....

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్...

పోల్స్