Friday, September 18, 2026 08:45 PM
Friday, September 18, 2026 08:45 PM

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు ముచ్చెమటలు..!

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది భారత రాష్ట్ర సమితి పార్టీ నేతల పరిస్థితి. వరుసగా రెండుసార్లు అధికారం అనుభవించిన తర్వాత హ్యాట్రిక్ ఖాయమనుకున్నారు. మనకు ఎదురే లేదనుకున్నారు. కానీ.. ఓడిపోయారు. ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు. అంతే.. నాటి నుంచి వారి అక్రమాలు, అవినీతి వెలికితీసే పనిలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉంది. ఫార్ములా వన్ ఈ కార్ రేస్‌లో అవినీతి నుంచి.. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హోజ్‌లో ప్రభుత్వ భూముల వరకు వ్యవహారం చేరింది. దీంతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

Also Read : భారత పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భూముల అస్త్రం బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? ఫామ్ హౌస్ లెక్కలన్నీ బయటకు వస్తాయని భయపడుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తెలంగాణ శాసనసభ వేదికగా నిషేధిత భూముల జాబితా, ధరణి పోర్టల్ నిర్వహణపై జరిగిన చర్చ రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని వారాలుగా 22ఏ జాబితాలో ప్రైవేటు భూములు ఉన్నాయంటూ భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ చేసిన ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి చెందిన భూకమతాలు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిసరాల్లోని సర్వే నెంబర్ల వివరాలను కూడా బహిర్గతం చేయడం ద్వారా ప్రతిపక్షాలు లేవనెత్తిన విమర్శనాత్మక శాస్త్రాన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు.

శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ దాడి ఇప్పుడు అలజడి రేపింది. కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా రాజకీయ, చట్టపరమైన ప్రణాళికతో ముందడుగు వేసినట్లు కనిపిస్తోంది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చాక భూ క్రమబద్దీకరణ విధానాలు, రికార్డుల సవరణల పేరుతో గత ప్రభుత్వ పెద్దలు లబ్ది పొందారనే ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం. అదే సమయంలో రాష్ట్రంలో కోటి ఎకరాలు 22ఏ నిషేధిత జాబితాలో ఉందన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను సీఎం ఖండించారు. అడవులు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ స్థలాలు కలిపి మొత్తం కోటి ఎకరాలు శాశ్వత నిషేధిత క్యాటగిరీలో ఉంటాయని… పౌరుల మధ్య వివాదంలో ఉన్న ప్రైవేటు భూమి కేవలం మూడు లక్షల ఎకరాలు మాత్రమేనని సీఎం స్పష్టం చేశారు.

Also Read : మేయర్ పీఠం ముస్లింలకే ఇవ్వాలి.. మాజీ ఎమ్మెల్యే సంచలనం..!

మరోవైపు సీఎం చేసిన ఆరోపణలతో పొలిటికల్ డ్యామేజ్ తప్పదని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమ పరిపాలన లోపాలను, 22ఏ డిజిటలైజేషన్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపిస్తోంది. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ పై వ్యూహాత్మక దాడి కాంగ్రెస్ పార్టీకి సామాజికంగా కలిసివచ్చే అంశం. అసైన్డ్ భూముల రక్షణ, దళిత హక్కుల అంశాన్ని ఎత్తుకోవడం ద్వారా బీఆర్ఎస్‌కు డిఫెన్స్ వాతావరణాన్ని సృష్టించవచ్చని అధికారపక్షం ఆశిస్తోంది. అంతిమంగా చూస్తే 22ఏ వివాదం కాస్త తెలంగాణాలో వ్యక్తిగత ఆస్తులు, భూముల విచారణ రణరంగానికి దారితీసింది. 30 రోజుల్లో సిద్ధిపేట రెవెన్యూ అధికారులు ఇచ్చే విచారణ నివేదిక రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో.. ఈ విచారణ ఎంతవరకు చట్టబద్ధంగా ముందుకు సాగుతుందో వేచి చూడాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

దేశంలోనే నెంబర్ వన్.....

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ జాతీయ...

పోల్స్