Wednesday, September 16, 2026 05:20 PM
Wednesday, September 16, 2026 05:20 PM

పరకాల.. విశ్వాసమెక్కడ..?

కనకపు సింహాసనంపై.. శునకంబును కూర్చోండ బెట్టిన.. వెనకటి గుణమేల మరుచు..అనేది వేమన శతకం. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావులో ఉన్న బలహీనత ఒకటే.. తాను అభిమానించే వారి కన్నా.. తనను అభిమానించే వారినే ఆయన ఎక్కువగా నమ్ముతారు. వారినే ఇష్టపడతారు. వారినే అందలం ఎక్కిస్తారు. అవినీతిపరులను, కోటీశ్వరులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరి చేరనివ్వరు. అంతే కాదు మధ్యతరగతికి చెందిన వారినే ఎక్కువగా నమ్ముతారు. ఇష్టపడుతారు కూడా. కానీ చంద్రబాబు, లోకేష్‌లో ఉన్న ఏకైక బలహీనత, కోటేశ్వరులనే ఎక్కువగా నమ్ముతుంటారంట..!

Also Read : ఏపీలో ఉద్యోగాల జాతర.. మరో గుడ్ న్యూస్..!

తమను అభిమానించే వారి కన్నా.. తాము అభిమానించే వారిలో.. ఎన్ని అవలక్షణాలు ఉన్నా సరే.. ఎంత చెడ్డవారైనా కూడా, వారిని చేరదీసి అందలం ఎక్కిస్తుంటారనేది ప్రధాన ఆరోపణ కూడా. చంద్రబాబు ఆశీస్సులతో పోస్టులు పొందిన వారిలో నూటికి 95 శాతం మంది పదవి పోయిన తర్వాత ఆయనను తిడుతున్న వారే. చంద్రబాబు అభిమానాలు, సెలక్షన్‌లు అలాగే ఉంటాయని సన్నిహితుల మాట. ప్రతి విషయంలో కులం కాకి లెక్క లేసుకుంటే.. ఇలాంటి పరిస్థితులే ఎదురవుతుంటాయనేది విమర్శకుల మాట. అలాంటి నమ్మక ద్రోహులలో ఒకరు పరకాల. నిజానికి భార్య పక్కన పెట్టారు.. కూతురు కూడా చీ కొట్టానా కూడా.. పరకాల తీరులో మాత్రం మార్పు రాలేదు.

అసలు విషయం ఏమిటంటే.. ఈటీవిలో ప్రతిధ్వని అనే ప్రోగ్రామ్‌లో పని చేసుకుంటున్న పరకాల అనే వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుగా నియమించిన చంద్రబాబు.. తన పక్కనే ఐదేళ్ల పాటు కూర్చొబెట్టుకున్నారు. అయితే చేసిన మేలు మరిచిన పరకాల.. ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో పరకాలను సొంత బంధువులు, మిత్రులే అసహ్యించుకుంటున్నారు. అన్ని రకాలుగా ఆయనకి మంచి గౌరవం ఇచ్చినందుకు చంద్రబాబుకు పరకాల అత్యంత విశ్వాసం బాగా చూపించారేమో..!

Also Read : ఏపీ పట్టణాలకు మహర్దశ.. భారీ ప్రాజెక్ట్ లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఇంత మంది ఎలా ఓట్లు వేశారనేది పరకాల ఇప్పుడు వేస్తున్న ప్రశ్న. అలాగే రాజధాని ఎవరిది..? ఎవరి కోసం ఈ రాజధాని..? అని.. వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు ఆయన అన్ని హోదాలు అనుభవించారు. పదవి పోయిన తర్వాత ఇప్పుడు పరకాల పరకాయ ప్రవేశం బయట పడింది. ఒక రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అనే మాదిరిగా పరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజధాని మీద పెద్ద పుస్తకం, నాలుగు గంటల డాక్యుమెంటరీ వేశారు. ఈ పెద్దాయన 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన పాలన గురించి ఎక్కడా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నాటి పాలకులకు కనీసం ఒక్క సలహా కూడా ఇవ్వలేదు. వారి పాలనపైన పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ కూటమి గెలుపు మీద మాత్రం.. రెండేళ్ల తర్వాత ఆయనకు అనుమానం వచ్చిందంట.

నిజానికి ఇలాంటి వారినే సీఎం చంద్రబాబు తొలి నుంచి పెంచి పోషించారనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీకి నమ్మకస్తులను, వీర విధేయులను పూర్తిగా పక్కన బెట్టి.. ఇలా ఏరు దాటిన తర్వాత తెప్ప తగులబెట్టే వారినే తన పక్కన పెట్టుకుంటారనేది ప్రధాన ఆరోపణ కూడా. ఇందుకు పరకాల ప్రభాకర్‌నే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇప్పటికైనా.. ఇలాంటి వారిని గుర్తించి.. పూర్తిగా పక్కన పెట్టాలనేది తెలుగు తమ్ముళ్ల విజ్ఞప్తి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణకు...

చంద్రబాబు సంచలన ప్రకటన.....

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు...

జగన్ రెడ్డి కాదా.....

త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన...

వైసీపీ ఒక్క సీటు...

ఉత్తరాంధ్రలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది....

చరిత్రలోనే తొలిసారి.. పవిత్ర...

ఇస్లాం మతస్తుల అత్యంత పవిత్ర నగరమైన...

ఏపీ పట్టణాలకు మహర్దశ.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీరు,...

పోల్స్