Tuesday, September 8, 2026 08:03 PM
Tuesday, September 8, 2026 08:03 PM

డీఎస్సీ వార్.. ఆరోపణలు సరే.. ఆధారాలేవి..?

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నియామక ప్రక్రియపై ఇటీవల వెలువడుతున్న ఆరోపణలు, వివాదాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో లక్షలాది మంది పోటీపడే పరిస్థితుల్లో.. ప్రతి అభ్యర్థి తన అర్హతలను నిరూపించుకునేందుకు అవసరమైన ధ్రువపత్రాలను స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరైనా అభ్యర్థి నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ గానీ, విద్యార్హత ధ్రువ పత్రంగానీ సమర్పించి మోసానికి పాల్పడితే.. ప్రాధమిక బాధ్యత ఆ అభ్యర్థిదే కాదా? అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది.

Also Read : బిగ్ టీవీలో బిగ్ బాంబ్.. సజ్జల గారి 60 కోట్ల ఫేక్ టాస్క్..!

ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థి సమర్పించే ధ్రువపత్రాల నిజానిజాలకు మొదటి బాధ్యత సదరు అభ్యర్థిదే. అయితే మోసపూరిత పత్రాలు వ్యవస్థలోకి ఎలా వచ్చాయి? వాటిని వెరిఫికేషన్‌లో ఎవరు గుర్తించలేకపోయారు..? నకిలీ పత్రాల వెనుక ఎవరున్నారు? వంటి అంశాలపై కూడా సమగ్ర విచారణ జరగాల్సిందే. ఒకవేళ విచారణలో సర్టిఫికెట్ నకిలీదని నిర్ధారణ అయితే.. ఆ అభ్యర్థిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో నకిలీ పత్రాలను తయారు చేసి జారీ చేసిన వ్యక్తులు, సంస్థలు.. వాటి నిజానిజాలను పరిశీలించే ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించిన అధికారులు ఎవరైనా ఉంటే వారి బాధ్యతను కూడా తేల్చాలి. అంటే.. మోసం చేసిన అభ్యర్థిని వదిలేయడం ఎంత తప్పో.. ఆధారాలు లేకుండా మొత్తం నియామక వ్యవస్థను తప్పుబట్టడం కూడా అంతే ప్రశ్నార్థకమే.

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందేందుకు కొందరు అభ్యర్థులు పక్కదారి పట్టడం ఏ ఒక్క రాష్ట్రానికో, ఏ ఒక్క ప్రభుత్వానికో పరిమితమైన విషయం కాదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో స్పోర్ట్స్ కోటాలో నకిలీ ట్రాంపోలైన్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారంపై విచారణ జరగగా.. 261 సర్టిఫికెట్లలో 258 బోగస్ తేలిన ఘటన వెలుగు చూసింది. రాజస్థాన్‌లో పీటీఐ నియామకాల్లో నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందిన 134 మందిని గుర్తించి తొలగించిన ఉదాహరణ ఉంది. తెలంగాణలో పోలీస్ నియామకాల్లో నకిలీ బోనాఫైడ్, విద్యా ధ్రువపత్రాలు సమర్పించిన 59 మంది అభ్యర్థుల ఎంపికను రద్దు చేసి.. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఉదాహరణలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నకిలీ పత్రాలు బయటపడితే.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడం నియామక వ్యవస్థలో భాగమే తప్ప.. ప్రతి అక్రమానికి మొత్తం నియామక ప్రక్రియనే రద్దు చేయడం పరిష్కారం కాదు.

ఇక్కడ అసలు ప్రశ్న ఇదే.. ఒకరిద్దరు అభ్యర్థులు చేసిన మోసాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం డీఎస్సీ నియామక ప్రక్రియనే అనుమానాస్పదంగా చిత్రీకరిస్తే.. దాని ప్రభావం ఎవరిపై పడుతుంది..? ఏళ్ల తరబడి చదివి.. పోటీ పరీక్షలు రాసి.. మెరిట్ ఆధారంగా ఉద్యోగం సాధించిన వేలాది మంది అభ్యర్థులపైన పడుతుంది. వారి నియామకాలు ఆలస్యమవుతాయి. వారి కుటుంబాల భవిష్యత్తు అనిశ్చితిలో పడుతుంది. తప్పు చేసిన కొందరి కారణంగా.. తప్పు చేయని వారంతా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నకిలీ సర్టిఫికెట్లను గుర్తించి మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలి.. కానీ నిజాయితీగా ఉద్యోగం సాధించిన అభ్యర్థుల హక్కులను కూడా అదే స్థాయిలో కాపాడాలి.

Also Read : వైఎస్ వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి సంచలనం..!

నియామక ప్రక్రియలో ఎక్కడైనా అక్రమం జరిగిందని ఆధారాలు ఉంటే.. వాటిని బయటపెట్టాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వెరిఫికేషన్‌లో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దాలి. అవసరమైతే స్వతంత్ర విచారణ కూడా జరిపించాలి. కానీ ఆధారాలతో నిర్ధారించాల్సిన అంశాన్ని కేవలం రాజకీయ ఆరోపణగా మార్చడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. పైగా.. వ్యవస్థపై నమ్మకం ఉంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిజమైన అభ్యర్థుల్లో మరింత గందరగోళం ఏర్పడుతుంది.

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో తప్పు చేసిన వారిని ఎంత కఠినంగా శిక్షించాలో.. కష్టపడి ఉద్యోగం సాధించిన నిజమైన అభ్యర్థుల భవిష్యత్తును కాపాడటం కూడా అంతే ముఖ్యం. మోసగాళ్లను ఏరివేయడం.. లోపాలను సరిదిద్దడం.. బాధ్యులపై చర్యలు తీసుకోవడం.. అదే సమయంలో అర్హులైన అభ్యర్థుల నియామకాలను రక్షించడం.. ఇదే సమతుల్య పరిష్కారం, ఒకరి మోసానికి శిక్ష పడాలి.. కానీ ఆ మోసం చేయని వేలాది మందికి శిక్ష ఎందుకు? అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీకి బిగ్ షాక్.....

స్థానిక సంస్థల ఎన్నికల ముందు వైఎస్‌ఆర్...

ఇప్పుడు కూడా బయటకు...

తెలంగాణ బాపు అని గొప్ప బిరుదు.....

వైఎస్ వివేకా హత్య...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య...

లోకల్ వార్.. ఎవరికి...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు...

మెగా ఫ్యామిలీకి వరుసగా...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర...

ఎల్పీజీ వినియోగదారులకు గుడ్...

ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కేంద్ర...

పోల్స్