తెలుగు రాష్ట్రాల మీడియా రంగంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త బిగ్ కామెడీ సర్కస్ నడుస్తోంది. మొన్నటి దాకా మెగా డీఎస్సీ ఫలితాలపై ఏదో పొడిచేస్తాం, సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తాం అంటూ హడావుడి చేసిన సదరు బిగ్ టీవీకి ఇప్పుడు గట్టి షాకే తగిలింది. డీఎస్సీ అభ్యర్థులపై యాజమాన్యం ఇచ్చిన డేటా అంతా పక్కా ‘ఫేక్’ అని తేలడంతో, ఆ పాపంలో మేము భాగస్వాములు కాలేమంటూ ఛానల్ చీఫ్ ఎడిటర్ అశోక్ తన పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.
Also Read : వైఎస్ వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి సంచలనం..!
ఆయన వెంటే మరో 20 మంది జర్నలిస్టులు కూడా తమ ఐడెంటిటీ కార్డులను టేబుల్‌పై పడేసి సామూహికంగా గేటు దాటేశారు. అసలు ఈ తప్పుడు ప్రచారాల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో బ్యూరోక్రాటిక్ సర్కిల్స్‌లో లీక్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత సజ్జల రామకృష్ణరెడ్డి ఈ ఛానల్‌లో ఏకంగా 60 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టారట. పైసలు పెట్టినందుకు ఎలాగైనా కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే ఏకైక లక్ష్యంగా.. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఫేక్ స్టోరీలు వండాలని, నిజాయితీగా ఉద్యోగాలు తెచ్చుకున్న అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి రచ్చ చేయాలని జర్నలిస్టులపై మేనేజ్మెంట్ తీవ్ర ఒట్టిడి తెచ్చిందట.
Also Read : కోల్పోయిన చోటే వెతుక్కున్న ఇషాన్ కిషన్.. ఇది కదా కమ్ బ్యాక్..!
ఒకపక్క ఇద్దరు మహిళా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు రూల్ బుక్ చూపించి నోళ్లు మూయించినా.. వినకుండా మళ్లీ మళ్లీ అదే అబద్ధాన్ని ప్రచారం చేయాలని సజ్జల బ్యాచ్ బలవంతం చేయడంతో జర్నలిస్టుల సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్తగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై వచ్చి ఏదో పెద్ద సంచలనం సృష్టించాలనే తపనలో, ఏకంగా ఒక పొలిటికల్ పార్టీకి పూర్తి ఎజెండాను మోస్తూ ఫేక్ వార్తలతో హడావుడి చేసి చివరకు అందరి ముందూ ఎదవలు అయ్యారని జర్నలిస్టు వర్గాలలో గట్టిగా నవ్వుకుంటున్నారు. నిజాలు దాచినా దాగవు, అబద్ధాలు ఎక్కువ రోజులు నిలబడవు అని నిరూపిస్తూ.. పెట్టిన 60 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు కావడం ఒకెత్తయితే.. నమ్ముకున్న స్టాఫ్ అంతా రోడ్డున పడేసి వెళ్ళిపోవడంతో బిగ్ టీవీ ఇప్పుడు ఎంప్టీ టీవీగా మారిపోయింది.

