Saturday, September 5, 2026 07:03 PM
Saturday, September 5, 2026 07:03 PM

ప్లేట్ తిప్పేసిన రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ కు జై..!

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యవహారం ఒక్కసారిగా చల్లబడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గ్యాప్ లేదని చెప్తూ రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా యు-టర్న్ తీసుకున్నారు. గతంలో పార్టీ అంతర్గత పరిణామాలపై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఆయన, తాజాగా మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం.

Also Read : బొత్స VS కళా.. పీఠం కోసం వారసత్వ పోరు

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందంటూ గతంలో ప్రచారం సాగగా, ఆ రూమర్లకు రాజగోపాల్ రెడ్డి గట్టిగా బ్రేక్ వేశారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిర ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయో.. అదే స్థాయిలో నా మునుగోడు నియోజకవర్గానికి కూడా నిధులు వచ్చాయి. ఇప్పటివరకు మునుగోడుకు ప్రభుత్వం నుండి రూ. 2,000 కోట్ల నిధులు మంజూరయ్యాయి” అని ఆయన స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే సీఎం అధికారిక సభకు వేలాది మంది కార్యకర్తలతో కలిసి వెళ్తానని ఆయన ప్రకటించారు.

Also Read : ఏపీ రాజకీయాల్లో బిగ్ షాక్.. రాజకీయాలకు అయ్యన్నపాత్రుడు గుడ్ బై..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకున్న సంబంధాలపై రాజగోపాల్ రెడ్డి కీలక వివరణ ఇచ్చారు. “నేను సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా ఎప్పుడూ దూషించలేదు. కేవలం ఒకటి లేదా రెండు ప్రభుత్వ నిర్ణయాత్మక అంశాల్లో మాత్రమే కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి తప్ప మా మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు” అని తేల్చి చెప్పారు. ఇక ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై స్పందిస్తూ.. క్యాబినెట్ విస్తరణ అనేది పూర్తిగా పార్టీ అధిష్ఠానం పరిధిలోని అంశమని, హైకమాండ్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ ఉద్యోగులకు సీఎం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యల...

టీవీకే టార్గెట్‌లో డీఎంకే...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రణం మొదలైంది....

ఏపీ రాజకీయాల్లో బిగ్...

ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు,...

సాయి రెడ్డి పార్టీకి...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా తీవ్ర...

తెలంగాణలో రేపే మంత్రివర్గ...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

పేపర్ మిల్లు మూసేస్తారా.....

రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుకు వెంటనే...

పోల్స్