Monday, August 31, 2026 01:05 PM
Monday, August 31, 2026 01:05 PM

30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ వెలుగులు..!

30 ఏళ్ల కల సాకారమైంది. గుక్కెడు నీటి కోసం మైళ్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళం పాడారు. వెయ్యి అడుగులు దాటితే తప్ప.. తడి చుక్క కనిపించని నేలకు.. కృష్ణమ్మను తీసుకువచ్చారు. 1996లో పునాది వేశారు.. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే ప్రాజెక్టును ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టు కూత వేటు దూరంలో ఉన్నా సరే.. నీరు వచ్చే అవకాశం లేకపోవడంతో.. ఇన్నాళ్లు లక్షల మంది ప్రజలు తీవ్ర దాహార్తితో అల్లాడి పోయారు. దాదాపు 30 మండలాల ప్రజల కోసం ఏకంగా నల్లమల అటవీ ప్రాంతంలో రెండు భారీ సొరంగాలు తవ్వారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌ను భగీరద ప్రయత్నంతో వెనుకబడిన మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు అందిస్తున్నారు.

Also Read : విశాఖకు మణిహారం.. ప్రముఖ ఆస్పత్రి వచ్చేసింది.

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.. ఈ ప్రాంతానికి ఒక ఎమోషనల్.. 30 ఏళ్ల ప్రజల కల సాకారం దిశగా వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యింది. “చిన్నప్పుడు ఊరు బావుల్లో ఈత కొట్టారు. అప్పుడు 100 అడుగులు లోతులో నీళ్లు వచ్చేవి. తరవాత రోజుల్లో బావులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు వెయ్యి అడుగుల లోతుకు వెళ్లిపోయాయి. మరల ఇప్పుడు అదే బావుల్లో ఈత కొట్టబోతున్నాము, ఆ రోజులు రాబోతున్నాయి. బావుల్లో నీళ్లు పైకి రాబోతున్నాయి..” అటు ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు అనేది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు.. ఇది ఒక ఎమోషనల్.

వెలిగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది చంద్రబాబు. మొదటిసారి 1996, మార్చి 5న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం సమీపంలోని గొట్టిపడియ ఆనకట్ట వద్ద రూ.980 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులను కేంద్రం నుంచి తీసుకున్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను కొనసాగించినప్పటికీ.. పరిహారం చెల్లింపులో అవకతవకలు, బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా.. పనులు నత్తతో పోటీ పడ్డాయి. దీంతో అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి కాలేదు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెలిగొండ సొరంగం పనులు వేగం అందుకున్నాయి.

Also Read : SC, STలకు జగన్‌ వెన్నుపోటు..!

2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని 2017లోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ దిశగా నాటి జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో పనులు పరుగులు పెట్టాయి కూడా. పునరావాస కాలనీల నిర్మాణం, కాలువల నిర్మాణ పనులు పూర్తి చేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో.. వెలిగొండకు గ్రహణం పట్టింది. కాంట్రాక్ట్ సంస్థ మార్పు, బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా.. ఐదేళ్ల కాలంలో కేవలం 5 శాతం మాత్రమే పనులు జరిగాయి. అయితే పనులు పూర్తి కాకుండానే.. ప్రాజెక్టు ప్రారంభం అంటూ 5 తేదీలను జగన్ ప్రకటించారు. చివరికి 30 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నా.. ఫీడర్ కెనాల్ నిర్మించకపోయినా, నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోయినా కూడా 06.03.2024 తేదీన జాతికి అంకితం అంటూ భారీ బహిరంగ సభ నిర్వహించి.. ఈ ప్రాంత వాసులను జగన్ నిలువునా మోసం చేశారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ప్రతి సోమవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షించారు. నిర్వాసితులకు ఏకంగా వెయ్యి కోట్ల వరకు పరిహారం చెల్లించారు. పునరావాస కాలనీలకు తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు నెలల క్రితం ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన చంద్రబాబు.. ప్రాజెక్టు ప్రారంభంపై తేదీ ప్రకటించారు. చెప్పినట్లుగానే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కు నీరు అందించారు. 30 ఏళ్ల కల సాకారం అవ్వడంతో.. ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బెజవాడ మేయర్ పీఠం...

విజయవాడలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. స్థానిక...

పవన్ కళ్యాణ్ మాస్టర్...

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి...

విశాఖకు మణిహారం.. ప్రముఖ...

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో మరో...

ఐటీ సారధే కాదు.....

నారా చంద్రబాబు నాయుడు పేరు చెబితే...

సజ్జల వర్సెస్ విజయసాయి.....

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత...

జగన్‌ని భయపెడుతున్న ఇండియా...

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌...

పోల్స్