శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం.. 23-08-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..
మేషం
చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
—————————————
వృషభం
ఇంటా బయట పరిస్థితులు కొంత నిరుత్సాహ పరుస్తాయి. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తికావు. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్య పరుస్తుంది. అనారోగ్య సమస్యలు భాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు.
—————————————
మిధునం
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన వివాహ విషయంలో చర్చలు సఫలం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
—————————————
కర్కాటకం
నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
—————————————
సింహం
కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులుగా ఉంటుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి.
—————————————
కన్య
దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కీలక వ్యవహారాలలో రెండు రకాలయిన ఆలోచనల వలన ఇబ్బందులు తప్పవు. బంధువులు, మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
—————————————
తుల
చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యత నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
—————————————
వృశ్చికం
కీలక వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
—————————————
ధనస్సు
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు స్దాన చలన సూచనలు ఉన్నవి.
—————————————
మకరం
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమై విశ్రాంతి లభించదు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.
—————————————
కుంభం
అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.
—————————————
మీనం
చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలించక నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ అధికమవుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. ఉద్యోగమున సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది.
—————————————
గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

