వర్ల రామయ్య.. ఎంతో కాలంగా చట్టసభకు ప్రాతినిధ్యం వహించాలనే కల ఇన్నాళ్లకు సాకారమైంది. నిజానికి ఎప్పటి నుంచో కంటున్న అధ్యక్ష అనే కల ఇప్పటికి తీరింది. పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన వర్ల రామయ్య తొలిసారి 2009లో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలో ప్రజారాజ్యం పార్టీ కూడా పోటీ చేయడంతో.. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ గెలిచారు. ఆ తర్వాత నుంచి ఏదో ఒక రూపంలో రాజ్యసభ రేసులో వర్ల పేరు వినిపిస్తూనే ఉంది. 2017-18 మధ్య కాలంలో అయితే.. దాదాపు ఖాయమనుకున్నారు కూడా. కానీ చివరి నిమిషంలో సీఎం రమేశ్ పేరు ఖరారు చేశారు.
Also Read : క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్‌కు అవమానకర రికార్డు..!
ఇక 2024 ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గం నుంచి వర్ల రామయ్య కుమారుడు కుమార్ రాజా ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో వర్ల కోరిక కుమారుడి రూపంలో తీరిందనే మాట బాగా వినిపించింది. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో కూడా వర్ల పేరు బాగా వినిపించింది. కానీ చివరికి ఆయన పేరు లేకపోవడంతో.. అంతా షాక్ అయ్యారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వర్ల.. కొద్ది రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా కూడా ఉన్నారు. తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా వర్ల రామయ్యకు అవకాశం దక్కింది. దీంతో వర్ల ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే వర్ల ఎంపికపై చాలా మంది గుర్రుగా ఉన్నారు. ఒకే ఇంట్లో కుమారుడు ఎమ్మెల్యే, తండ్రి ఎమ్మెల్సీ.. ఎందుకిలా అని ప్రశ్నిస్తున్నారు కూడా.
Also Read : ప్రత్యక్ష ఎన్నిక.. చంద్రబాబు వ్యూహం అదే..!
అయితే వర్ల రామయ్యను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం వెనుక చంద్రబాబు పక్కా ప్లానింగ్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలో ప్రస్తుత మండలి ఛైర్మన్ కోయే మోషెన్ రాజు పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో వర్ల రామయ్యను మండలి ఛైర్మన్‌ను చేయాలనేది చంద్రబాబు ప్లాన్. అదే జరిగితే.. మండలిలో కూడా వైసీపీ నేతలకు బ్రేకులు వేసినట్లు అవుతుందనేది చంద్రబాబు ప్లాన్. రెండు రోజుల క్రితమే మండలి వైస్ ఛైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు. ఇందుకు ప్రధాన కారణం.. మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువ. అయితే 2027 చివరి నాటికి చాలా మంది వైసీపీ సభ్యుల పదవీ కాలం ముగిసిపోతుంది. వారి స్థానంలో టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు సభలో ఉంటారు. అందుకే ముందు నుంచే మండలి ఛైర్మన్ పదవి రేసులో వర్ల రామయ్యను చంద్రబాబు నిలిపినట్లు అయ్యింది.

