Saturday, August 22, 2026 03:33 PM
Saturday, August 22, 2026 03:33 PM

క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్‌కు అవమానకర రికార్డు..!

హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, ఒల్లీ రాబిన్సన్ ధాటికి పాక్ బ్యాటింగ్ లైన్అప్ పూర్తిగా చేతులెత్తేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి కేవలం 171 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్, రెండో ఇన్నింగ్స్‌లోనూ కనీస పోరాట పటిమ చూపించలేకపోయింది. ఇంగ్లండ్ విధించిన భారీ లక్ష్యం ముందు నిలవలేక ఇన్నింగ్స్ తేడాతో ఘోరంగా ఓడిపోయింది.

Also Read : భోగాపురం నుంచి విశాఖ ఎంత సమయమో తెలుసా.. భువనేశ్వరి క్లారిటీ..!

ఈ ఓటమితో పాటు పాకిస్తాన్ జట్టు టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒక దారుణమైన, అవమానకరమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్ గడ్డపై కనీసం 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేయకుండా పాక్ జట్టు ఏకంగా 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ డకౌట్‌గా వెనుతిరగడంతో పాక్ ఓపెనర్ల వైఫల్యం మరోసారి బయటపడింది. ఇంగ్లండ్ దేశంలో వరుసగా గత 27 ఇన్నింగ్స్‌ల నుండి ఒక్కసారి కూడా పాకిస్తాన్ ఓపెనర్లు కనీసం 50 పరుగుల పార్ట్నర్‌షిప్ నెలకొల్పలేకపోయారు.

Also Read : మెగా బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసింది.. ఊరమాస్ గ్లింప్స్ రిలీజ్..!

చివరిగా 2010లో సల్మాన్ బట్, ఇమ్రాన్ ఫర్హత్ ద్వయం ఇంగ్లండ్ గడ్డపై 56 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని జోడించారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఆ జట్టుకు బలమైన పునాది వేసే ఓపెనర్ దొరకలేదు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కూడా పాకిస్తాన్ అట్టడుగు స్థానానికి పడిపోవడంతో ఆ జట్టు ఆటతీరుపై మాజీ ఆటగాళ్లు, అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆట కంటే కూడా చేసిన తప్పులే ఆ జట్టు ఓటమికి కారణం కావడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సబ్ రిజిస్ట్రార్‌కు టీడీపీ...

అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే...

సాయి రెడ్డితో రాజీ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్...

ఆగస్టు 24 నుండి...

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట...

భోగాపురం నుంచి విశాఖ...

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి సర్కార్ చర్యలు...

కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న అసమ్మతి..!

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

ఈడీ సోదాలు.. వైసీపీ...

వైసీపీ నేతలు ఏ అంశం అయినా...

పోల్స్