చాలా మంది టీ లేదా కాఫీ తాగుతున్నప్పుడు, మొబైల్ నంబర్ రాస్తున్నప్పుడు లేదా ఏదైనా వస్తువును పట్టుకోబోయినప్పుడు చేతులు అదుపులేకుండా వణకడం మనం చూస్తుంటాం. సాధారణంగా దీనిని వయస్సు పైబడటం వల్ల వచ్చే బలహీనతగానో, లేదా కంగారు, భయం వల్ల వచ్చే నరాల సమస్యగానో భావించి లైట్ తీసుకుంటారు. కానీ ఇది పార్కిన్సన్స్ కంటే ఎక్కువగా కనిపించే ఎసెన్షియల్ ట్రెమర్ అనే ఒక నిర్దిష్టమైన నరాల సంబంధిత రుగ్మత కావచ్చని నిపుణులు అంటున్నారు.
Also Read : నోటీసులకు జవాబు ఇవ్వాలి.. లేదంటే ఓటు ఔట్..!
ఈ స్థితిలో చేతులు మరియు ముంజేతులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి, కొన్నిసార్లు తల, వాయిస్ కూడా వణుకుకు గురవుతాయి. పార్కిన్సన్స్ వ్యాధిలో చేతులు ఖాళీగా ఉన్నప్పుడు వణికితే, ఈ ఎసెన్షియల్ ట్రెమర్‌లో మాత్రం చేతులతో ఏదైనా పని చేస్తున్నప్పుడు మాత్రమే వణుకు మొదలవుతుంది. ఈ ఎసెన్షియల్ ట్రెమర్ రావడానికి అసలు కారణాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, మెదడు వెనుక భాగంలో ఉండి కండరాల కదలికలను నియంత్రించే సెరెబెల్లమ్ లో వచ్చే సిగ్నలింగ్ లోపాల వల్ల ఇది సంభవిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, దీనికి జన్యుపరమైన కారణాలు కూడా బలంగా ఉన్నాయి.
Also Read : కిమ్ జోంగ్ తో స్నేహానికి ట్రంప్ ట్రయల్స్..!
దాదాపు 50 శాతం కేసులలో ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా వేళ్లలో చిన్న కదలికలా ప్రారంభమై, కాలక్రమేణా రెండు చేతులకూ విస్తరిస్తుంది. మానసిక ఒత్తిడి, సరిపడా నిద్ర లేకపోవడం, అలసట, కెఫిన్ లేదా తీవ్రమైన చలి/వేడి వాతావరణం వల్ల ఈ చేతుల వణుకు మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్యను గుర్తించడానికి ప్రత్యేకమైన బ్లడ్ టెస్టులు లేదా బ్రెయిన్ స్కాన్లు ఏవీ లేవు. డాక్టర్లు రోగి కదలికలు, ఫ్యామిలీ హిస్టరీ మరియు ఇతర థైరాయిడ్ లాంటి సమస్యలను రూల్ అవుట్ చేయడం ద్వారా దీనిని నిర్ధారిస్తారు. ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు, పైగా మైల్డ్ వణుకు ఉన్నవారికి పెద్దగా చికిత్స కూడా అవసరం లేదు. జీవనశైలి మార్పులు, బీటా-బ్లాకర్స్ వంటి మెడిసిన్ ద్వారా దీని తీవ్రతను తగ్గించవచ్చు.

