Wednesday, August 12, 2026 09:03 PM
Wednesday, August 12, 2026 09:03 PM

ఏపీలో కొత్త మద్యం పాలసీ..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రైవేట్ మద్యం దుకాణాల పాలసీ గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో.. తదుపరి విధానంపై ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కొత్తగా లైసెన్సులు జారీ చేయాలా? లేక ప్రస్తుత లైసెన్సీలకే మరోసారి అవకాశం కల్పించాలా? అన్న అంశంపై ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అక్టోబర్ 12 నుంచి ప్రైవేట్ రిటైల్ మద్యం విక్రయ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మొత్తం 3,736 దుకాణాలకు లైసెన్సులు కేటాయించగా.. అందులో 3,396 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో, 340 దుకాణాలు ‘గీత కులాల’కు కేటాయించేలా పాలసీలో నిర్ణయించారు. లైసెన్సుల ఎంపిక లాటరీ విధానంలో చేపట్టారు.

Also Read : డీఎస్సీ ఉద్యమం.. టీచర్లు సక్సెస్.. వైసీపీ ఫెయిల్‌

గతంలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు సమయంలో దరఖాస్తు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. అయితే లైసెన్సీలు ఆశించిన స్థాయిలో వ్యాపార మార్జిన్లు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం అనంతరం మార్జిన్లను పెంచినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కొత్త పాలసీకి వెళితే గత స్థాయిలో దరఖాస్తులు వస్తాయా? అన్న సందేహాలు ఎక్సైజ్ శాఖలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత లైసెన్సు గడువు ముగిసిన తర్వాత కొత్తగా దరఖాస్తులు ఆహ్వానిస్తే.. వ్యాపార పరిస్థితులను అంచనా వేసి లైసెన్సీలు ఎంతమంది ముందుకు వస్తారన్నది కీలకంగా మారనుంది. గత పాలసీలో లైసెన్సీలకు ఎదురైన వ్యాపార ఇబ్బందుల నేపథ్యంలో కొత్త దరఖాస్తుల సంఖ్య తగ్గితే ప్రభుత్వానికి దరఖాస్తు ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంపైనా ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : రాజకీయాల్లోకి జగన్ వారసురాలు.. డేట్, ప్లేస్ ఫిక్స్..!

ఈ నేపథ్యంలో కొత్తగా లైసెన్సుల ప్రక్రియ చేపట్టకుండా.. ప్రస్తుతం మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న లైసెన్సీలకే నిబంధనల మేరకు రెన్యువల్ అవకాశం కల్పించే ప్రతిపాదనను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త పాలసీ రూపకల్పనలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, లైసెన్సీల వ్యాపార పరిస్థితులు, మద్యం విక్రయాల నియంత్రణ, ప్రజారోగ్య అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. 2024 – 26 పాలసీ కింద ప్రైవేట్ రిటైల్ దుకాణాల లైసెన్సు కాలం 2026 సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అందువల్ల ప్రస్తుత లైసెన్సీలకే రెన్యువల్ ఇస్తారా? లేక కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించి లాటరీ లేదా ఇతర విధానంలో లైసెన్సులు కేటాయిస్తారా? అన్నదానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ తుది నిర్ణయంపైనే మద్యం వ్యాపారుల భవిష్యత్తు, ఎక్సైజ్ ఆదాయంపై తదుపరి దిశ ఆధారపడి ఉండనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజకీయాల్లోకి జగన్ వారసురాలు.....

వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయంగా కంచుకోటగా ఉన్న...

డీఎస్సీ ఉద్యమం.. టీచర్లు...

వైసీపీ డీఎస్సీ ధర్నా.. ఆపరేషన్‌ సక్సెస్...

విదేశీ శ్రీవారి భక్తులకు...

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని...

ప్రకాశ్ రాజ్ ఓటు...

బెంగళూరు నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...

డిప్యూటి సిఎం భార్యపై...

తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి...

శాంతిభద్రతలపై సీఎం నేడు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా...

పోల్స్