Wednesday, August 12, 2026 09:02 PM
Wednesday, August 12, 2026 09:02 PM

సరికొత్త మహీంద్రా థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అప్పుడే..!

భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ మహీంద్రా థార్ 3-డోర్’ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌తో మార్కెట్లోకి దూసుకురావడానికి సిద్ధమైంది. ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరికొత్త వాహనాలను పరిచయం చేసే ఆనవాయితీని కొనసాగిస్తూ, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఈ ఏడాది ఆగస్టు 15న నిర్వహించబోయే తమ వార్షిక ఫ్రీడమ్ డ్రైవ్ ఈవెంట్‌లో ఈ సరికొత్త థార్‌ను లాంచ్ చేయనున్నట్లు ముందు ప్రచారం జరిగింది.

Also Read : ఢిల్లీ వేదికగా మళ్లీ బీజేపీకి జగన్ జై..!

పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త 2026 థార్ మోడల్‌లో వినియోగదారుల చిరకాల కోరికలను నెరవేరుస్తూ భద్రత, లగ్జరీ, మరియు ఫీచర్ల పరంగా 5 ప్రధాన మార్పులు చేయబోతున్నారు. ఆ అద్భుతమైన ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త థార్ ఫేస్‌లిఫ్ట్‌లో రాబోతున్న అత్యంత కీలకమైన అప్‌డేట్ అడాస్.. సాంకేతికత. ఇటీవల రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న సమయంలో విండ్‌షీల్డ్ వెనుక అమర్చిన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించారు.

దీని ద్వారా వాహనానికి ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు లభిస్తాయి. ఇది మహీంద్రా థార్ రాక్స్, స్కార్పియో-ఎన్ తరహాలోనే ప్రయాణికులకు గరిష్ట రక్షణను కల్పిస్తుంది. పాత మోడల్‌లో ఉన్న అనలాగ్ మీటర్ల స్థానంలో ఈసారి పూర్తి ప్రీమియం లుక్ ఇచ్చేలా 10.25-ఇంచుల పూర్తి డిజిటల్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పరిచయం చేస్తున్నారు.

Also Read : ఆ రాష్ట్రానికి శాపంగా మారిన పులులు..?

ఈ మోడ్రన్ డిస్‌ప్లేలో కేవలం వేగం మాత్రమే కాకుండా నావిగేషన్ గైడెన్స్, ఆఫ్-రోడ్ డేటా, ఇంధన సామర్థ్యం, మరియు వాహనానికి సంబంధించిన హెచ్చరికలను స్పష్టంగా చూసుకోవచ్చు. డ్రైవర్లు తమకు నచ్చిన విధంగా దీని ఇంటర్‌ఫేస్ లేఅవుట్‌ను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. కారు క్యాబిన్‌లో ప్రయాణాన్ని మరింత వినోదాత్మకంగా మార్చేందుకు మహీంద్రా సంస్థ ఇందులో లగ్జరీ కార్లలో వాడే ప్రముఖ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్‌ను తీసుకువస్తోంది. థార్ యొక్క రగ్గడ్ మరియు రఫ్ లుక్‌కు ఈ ప్రీమియం ఆడియో సిస్టమ్ తోడవడంతో క్యాబిన్ లోపల హోమ్ థియేటర్ లాంటి మ్యూజిక్ అనుభూతి కలుగుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీలో కొత్త మద్యం...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీపై ఉత్కంఠ...

రాజకీయాల్లోకి జగన్ వారసురాలు.....

వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయంగా కంచుకోటగా ఉన్న...

డీఎస్సీ ఉద్యమం.. టీచర్లు...

వైసీపీ డీఎస్సీ ధర్నా.. ఆపరేషన్‌ సక్సెస్...

విదేశీ శ్రీవారి భక్తులకు...

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని...

ప్రకాశ్ రాజ్ ఓటు...

బెంగళూరు నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...

డిప్యూటి సిఎం భార్యపై...

తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి...

పోల్స్