Monday, August 10, 2026 12:04 PM
Monday, August 10, 2026 12:04 PM

ప్రిన్స్ బర్త్ డే స్పెషల్.. ‘రుద్ర’ ఫస్ట్ లుక్ అదుర్స్..!

సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు పుట్టినరోజును ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులకు డబుల్ ట్రీట్ లభించింది. ఒకవైపు కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీల నేతలు. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మహేశ్‌కు శుభాకాంక్షలు తెలుపగా, మరోవైపు మహేశ్‌ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాలో మహేశ్‌ ‘రుద్ర’ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు.

Also Read : ఈవీ జోరు.. టాప్‌లో యూపీ.. మరి ఏపీలో..?

మహేశ్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అందమైన ఫ్యామిలీ ఫొటో షేర్ చేశారు. మహేశ్‌, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఉన్న ఫొటో పోస్ట్ చేస్తూ, “హ్యాపీ బర్త్ డే MB! ప్రతి రోజును ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు. ఈ ఏడాది నీకు ప్రేమ, ఆరోగ్యం, అనంతమైన సంతోషం లభించాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం” అని రాసుకొచ్చారు. కుమార్తె సితార కూడా తండ్రికి ముద్దు పెడుతున్న ఫొటో షేర్ చేస్తూ, “హ్యాపీ బర్త్ డే నాన్న. ఎప్పటికీ నా ఫేవరెట్ పర్సన్ మీరే” అని తన ప్రేమ వ్యక్తపరిచింది.

మరోవైపు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వారణాసి’ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు. వెదురు తెప్పపైన ప్రశాంతంగా కూర్చున్న మహేశ్‌, మరో పోస్టర్‌లో అడవి మధ్యలో ప్రకృతిని చూస్తూ నిల్చున్న లుక్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. “రుద్ర అంటే కేవలం భయంకరమైనవాడు మాత్రమే కాదు” అనే క్యాప్షన్‌తో ఈ లుక్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజమౌళి ‘రుద్ర’ పాత్ర గురించి ఒక సుదీర్ఘమైన, ఆసక్తికరమైన నోట్‌ పంచుకున్నారు. “రుద్ర ఒక గొప్ప ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి పుట్టాడు. తను అడగని ఒక విధిని మోస్తున్నాడు. అతను చమత్కారి, సున్నితమైన వాడు, అదే సమయంలో భయంకరమైనవాడు. మహేష్ ఆ పాత్రకు ప్రాణం పోశాడు. భయంకరంగా ఎవరైనా నటించగలరు, కానీ భయంకరంగా, సున్నితంగా ఒకేసారి నటించడం చాలా కొద్దిమందికే సాధ్యం” అని రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు ఎంతో బూస్ట్ ఇచ్చినట్లు అయ్యాయి.

Also Read : “భారతి” పై స్థానికుల తిరుగుబాటు..!

ఆఫ్రికా షెడ్యూల్ అనుభవాలను వివరిస్తూ.. “ఈ ఫ్రేమ్స్ ఆఫ్రికా షెడ్యూల్‌లోనివి. కిలిమంజారో, మసాయ్ మారా ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని 1.43:1 ఐమాక్స్ ఫ్రేమ్‌లో కూడా బంధించలేమని కొన్ని ఉదయాలు అనిపించింది” అని రాజమౌళి తెలిపారు. మొత్తంగా పుట్టినరోజున ఫ్యామిలీ విషెస్‌తో పాటు సినిమా అప్‌డేట్ రావడంతో మహేశ్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఒంగోలు పాలిటిక్స్‌లో కూటమి...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమికి చెందిన ఇద్దరు...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా...

ఏపీలో త్వరలోనే క్యాబినెట్‌...

ఏపీ రాజకీయాల్లో మరోసారి కేబినేట్ ప్రక్షాళన...

పార్టీ ఆఫీస్ లో...

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు...

పోలీసులను టార్గెట్ చేసిన...

గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన...

జనసేన జెండా కోసం...

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయంగా...

పోల్స్