Sunday, August 9, 2026 06:31 AM
Sunday, August 9, 2026 06:31 AM

ఈరోజు రాశి ఫలితాలు (09-08-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాడ మాసం, బహుళ పక్షం.. 09-08-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారంలో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

—————————————

వృషభం

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో భూవివాదాలు కలుగుతాయి. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు.

—————————————

మిధునం

కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

—————————————

కర్కాటకం

సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

—————————————

సింహం

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ అవుతాయి.

—————————————

కన్య

రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

—————————————

తుల

పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం అందదు.

—————————————

వృశ్చికం

చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తికావు. కొన్ని విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది.

—————————————

ధనస్సు

సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుతాయి.

—————————————

మకరం

సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. రాజకీయ వర్గాల ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. భూ సంభందిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.

—————————————

కుంభం

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది.

—————————————

మీనం

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగములు సామాన్యంగా సాగుతాయి.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మంత్రులకి లోకేష్‌ బిగ్‌...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా...

ఏపీలో త్వరలోనే క్యాబినెట్‌...

ఏపీ రాజకీయాల్లో మరోసారి కేబినేట్ ప్రక్షాళన...

పార్టీ ఆఫీస్ లో...

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు...

పోలీసులను టార్గెట్ చేసిన...

గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన...

జనసేన జెండా కోసం...

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయంగా...

కవితను లైట్ తీసుకున్న...

తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ...

పోల్స్