Saturday, September 19, 2026 12:03 PM
Saturday, September 19, 2026 12:03 PM

రోజుకు రెండు అరటిపండ్లు తింటున్నారా..? ఈ విషయం తెలుసా..?

మన వంటింట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే అతి సాధారణమైన, అందరికీ ఇష్టమైన పండు అరటిపండు. వర్కవుట్ ముందు శక్తి కోసం అయినా, ఆకలి వేసినప్పుడు స్నాక్‌ గా అయినా చాలా మంది రోజుకు రెండు అరటిపండ్లు తినేస్తుంటారు. అయితే, ఇలా రోజుకు రెండు అరటిపండ్లు క్రమం తప్పకుండా తినడం ఆరోగ్యానికి మంచిదేనా, లేక దీనివల్ల ఏవైనా నష్టాలు ఉన్నాయా అనే విషయంపై ప్రముఖ క్లినికల్ న్యూట్రిషనిస్ట్లు అంజలి ముఖర్జీ, లోవ్‌నీత్ బత్రా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Also Read : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. సహజీవనంలో ఉన్న మహిళలకూ ఆ సెక్షన్..!

సాధారణ ఆరోగ్యవంతులకు ఇది మేలు చేసినప్పటికీ, కొందరికి మాత్రం దీనివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అరటిపండ్లలో ఉండే పోషకాలు గుండెకు, జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేసినా, అందరి శరీర తత్వాలు ఒకేలా ఉండవని వారు గుర్తుచేస్తున్నారు. న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం.. రోజుకు రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి దాదాపు 844 మిల్లీగ్రాముల పొటాషియం అందుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచి, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని 21 శాతం వరకు తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది.

అలాగే వీటిలో ఉండే విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరిచి, మూడ్‌ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోజంతా అలసిపోకుండా స్థిరమైన శక్తిని ఇస్తుంది. ఉదయం అల్పాహారంతో పాటు ఒకటి, సాయంత్రం వ్యాయామానికి ముందు ఒకటి చొప్పున సమయం ఇచ్చి తింటే ఈ పోషకాలు శరీరానికి మరింత బాగా అందుతాయి. కానీ, కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు మరియు రక్తపోటు కోసం ప్రత్యేక మందులు వాడేవారు రోజుకు రెండు అరటిపండ్లు తినడం అస్సలు మంచిది కాదు.

Also Read : దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.. వైసీపీ నేత సవాల్..!

కిడ్నీలు బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలోని అదనపు పొటాషియం బయటకు వెళ్లకుండా రక్తంలో పేరుకుపోయి హైపర్‌ కలేమియా అనే ప్రమాదకర పరిస్థితికి దారితీస్తుంది. ఇది గుండె లయను తప్పుపట్టేలా చేస్తుంది. దీనితో పాటు, రెండు అరటిపండ్ల ద్వారా శరీరానికి ఒకేసారి 210 క్యాలరీలు, దాదాపు 30 గ్రాముల సహజ చక్కెర అందుతుంది. అందువల్ల టైప్-2 డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు వీటిని తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. మధుమేహం ఉన్నవారు అరటిపండ్లను పీనట్ బటర్ లేదా పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్