శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అతి ఉత్సాహం, ఓవరాక్షన్ చివరకు పోలీసు కేసులకు దారితీసింది. జులై 30వ తేదీన మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా వైసిపి శ్రేణులు ప్రదర్శించిన బాధ్యతారాహిత్య ప్రవర్తనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా ప్రవర్తించారనే ఆరోపణలపై ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తో పాటు మరో 16 మంది ముఖ్యమైన వైసిపి నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అధికారికంగా కేసులు నమోదు చేశారు.
Also Read : టీం ఇండియాకు మళ్ళీ బూమ్రా షాక్..!
వాస్తవానికి జగన్ పర్యటనకు పోలీసులు కొన్ని కఠినమైన షరతులు, ఆంక్షలతో కూడిన ముందస్తు అనుమతులు మాత్రమే ఇచ్చారు. అయితే, ఆ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయని వైసిపి శ్రేణులు జాతీయ రహదారిపై భారీ ఎత్తున జనసమీకరణ చేసి తీవ్ర హంగామా సృష్టించాయి. పోలీసుల ఆంక్షలకు విరుద్ధంగా మొండిగా ర్యాలీలు నిర్వహించడమే కాకుండా, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని ఇబ్బంది పెడుతూ ఓవరాక్షన్ చేయడంతో జె.ఆర్.పురం మరియు ఎచ్చెర్ల పరిధిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి సామాన్య ప్రజలు నరకం చూడాల్సి వచ్చింది.
Also Read : తినేది ఇండియా తిండి.. ఉండేది దుబాయ్.. స్టార్ హీరోలకు థాకరే గడ్డి..!
శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కినందుకే జె.ఆర్.పురం, ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదైనట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వైసిపి నాయకులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, లీగల్ పర్మిషన్స్ లేకుండా అంతలా ఓవరాక్షన్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసుల నమోదుతో జిల్లా రాజకీయాల్లో వైసిపి గీత దాటితే కూటమి ప్రభుత్వం ఊపేక్షించదనే సంకేతాలు వెళ్లాయనే మాట వినపడుతోంది.

