Friday, July 31, 2026 09:32 PM
Friday, July 31, 2026 09:32 PM

అంతర్జాతీయ అద్భుతం.. మన భోగాపురం..!

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, నిర్దేశిత గడువు కంటే ముందే పూర్తి కావడం విశేషం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులతో ఇది రూపుదిద్దుకుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలను నెరవేరుస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో ఇదొక సువర్ణాధ్యాయంగా మారుతోంది.

Also Read : జనసేనాని ఆన్ డ్యూటీ.. ప్రక్షాళన మొదలు.!

భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సులభతర ప్రయాణం కోసం 40 చెక్-ఇన్ కౌంటర్లు, 12 డిగ్రీ యాత్ర పాడ్స్, సెల్ఫ్-సర్వీస్ బ్యాగేజ్ డ్రావ్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థలు, ఇమ్మిగ్రేషన్, ఎమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల షాపింగ్, వినోదం కోసం కమర్షియల్ స్పేస్‌లు, రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్ లెట్లు కొలువుదీరన్నాయి. తుఫానులను సైతం తట్టుకునేలా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులను సైతం నిరోధించే సైక్లోన్-రెసిస్టెంట్ డిజైన్‌తో దీన్ని నిర్మించారు.

ఆర్థికాభివృద్ధికి ఇది ఓ గ్రోత్ ఇంజిన్ కానుంది. ఆసియాలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మహా నగరం విశాఖపట్నం. ఇక్కడ నుంచి అల్లూరి విమానాశ్రయానికి అనుసంధానాన్ని మెరుగుపరచడానికి చేపట్టిన రోడ్డు, ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యాయి. ఈ విమానాశ్రయం పర్యాటకం, రవాణా రంగాలతో పాటు వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు, పారిశ్రామిక ఎగుమతులకు ప్రధాన ఉత్ప్రేరకంగా మారుతుందని భావిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి రంగానికి మరింత ఊపు రానుంది. విమానాశ్రయంతో పాటు జీఎంఆర్ ఏరో సిటీ పరిధిలో హోటళ్లు, వాణిజ్య కేంద్రాలు, వినోద జోన్లు రూపుదిద్దుకుంటున్నాయి.

ఎయిర్ పోర్టులో ఏవియేషన్, ఏరోస్పేస్ రంగానికి ప్రత్యేకంగా 500 ఎకరాలు కేటాయించగా, భీమిలి మండలం అన్నవరంలో జీఎంఆర్ – మాన్సాస్ ఎడ్యుసిటీ ద్వారా పైలట్లు, ఏరోస్పేస్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్థానిక యువత ఉపాధి కోసం వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎయిర్ బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో ‘క్యాట్-ఐ’ రన్ వే సిద్ధం చేశారు.

Also Read : భోగాపురం.. మూడు రాష్ట్రాల పవర్‌ హౌస్‌

సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, రెండు అంతస్తులుగా విశాలమైన ప్యాసింజర్ టెర్మినల్‌ నిర్మించారు. మొదటి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉండగా, రాబోయే రోజుల్లో 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం తీర ప్రాంత విశిష్టతను చాటేలా ‘ఎగిరే చేప’ ఆకృతిలో ప్రేరణ పొందింది. టెర్మినల్ పైకప్పు సాంప్రదాయ ‘శ్రీగ్రామ్’ థీమ్ ఆర్ట్స్ ఆకట్టుకునేలా ఉంది. 55 మీటర్ల ఎత్తులో, 360 డిగ్రీల నిహంగ నీక్షణ సేవలు అందించేలా ఎంటీసీ టవర్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన కార్గో టెర్మినల్ ద్వారా వార్షికంగా 25,000 టన్నుల వస్తువులను నిర్వహించవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

భోగాపురం భోగం ఎవరిది.....

మరికొన్ని గంటల్లో విజయనగరం జిల్లా భోగాపురంలో...

జనసేనాని ఆన్ డ్యూటీ.....

జనసేనలో రాష్ట్ర అధికార ప్రతినిధుల వ్యవస్థను...

వాళ్ళను వదిలే ప్రసక్తే...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

భోగాపురం.. మూడు రాష్ట్రాల...

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో శనివారం సరికొత్త అధ్యాయం...

కృష్ణా డెల్టాకు గోదారమ్మ...

గత రెండు నెలలుగా వర్షాలు లేక...

అడ్డంగా దొరికిపోయిన కేటిఆర్..?

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా...

పోల్స్