Saturday, September 19, 2026 09:20 AM
Saturday, September 19, 2026 09:20 AM

స్టూడెంట్స్ కు యూఎస్ వీసా షాక్..!

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉద్యోగం చేయాలనుకునే భారత విద్యార్థుల కలలపై ట్రంప్ యంత్రాంగం సరికొత్త నిబంధనలతో కోలుకోలేని దెబ్బ కొట్టబోతోంది. యూఎస్‌లో చదువు పూర్తయిన తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అక్కడ ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ పై ఏకంగా 1,00,000 డాలర్లు అంటే సుమారు రూ. 95 లక్షలు భారీ ఫీజు విధించే ప్రతిపాదనను అమెరికా హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తీవ్రంగా పరిశీలిస్తోంది.

Also Read : ఇంటింటికి టీడీపీ.. కూటమిలో అసంతృప్తి..!

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఈ ప్రతిపాదన చర్చల దశలోనే ఉన్నప్పటికీ, ఈ భారీ మొత్తాన్ని విద్యార్థులు చెల్లించాలా లేదా వారిని చేర్చుకునే కంపెనీలు భరించాలా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ ఫీజు ప్రతిపాదనతో పాటు, దశాబ్దాలుగా కొనసాగుతున్న విద్యార్థుల వీసా నిబంధనలను మారుస్తూ ట్రంప్ సర్కార్ ఒక కఠినమైన నియమాన్ని ఖరారు చేసింది. ఇప్పటివరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేస్తూ, విదేశీ విద్యార్థుల వీసా గడువుపై గరిష్టంగా 4 ఏళ్ల కాలపరిమితిని విధించారు.

Also Read : ఏపీలో పోలీసు వ్యవస్థ పని చేస్తుందా..?

దీని ప్రకారం, అమెరికా వచ్చే విద్యార్థులు కేవలం 4 ఏళ్లు మాత్రమే చట్టబద్ధంగా అక్కడ ఉండగలరు. ఒకవేళ వారి పీహెచ్‌డీ, రీసెర్చ్ లేదా ఉన్నత చదువులకు 4 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పడితే, వారు ఆటోమేటిక్‌ గా అక్కడ కొనసాగలేరు. తప్పనిసరిగా ఇమ్మిగ్రేషన్ విభాగంకు విడిగా దరఖాస్తు చేసుకుని గడువు పెంపు పొందాల్సి ఉంటుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి మరియు జాతీయ భద్రతను పటిష్టం చేయడానికే ఈ కఠినమైన సంస్కరణలు తెస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం సమర్థించుకుంటోంది. అయితే, ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్య నభ్యసిస్తున్న 3.3 లక్షల మందికి పైగా భారత విద్యార్థులపై ఈ నిర్ణయాలు తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని చూపనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

పోల్స్