Sunday, September 13, 2026 11:53 AM
Sunday, September 13, 2026 11:53 AM

సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై దుమారం..!

జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ ల టీ20 సిరీస్‌ కు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ ను ఎంపిక చేయకపోవడంపై భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇంగ్లాండ్ సిరీస్‌ లో ఆఖరి మ్యాచ్ ఆడిన శాంసన్‌ ను ఆ తర్వాత జింబాబ్వే పర్యటనకు దూరం పెట్టడంపై భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంజు శాంసన్‌ ను జట్టు నుంచి తొలగించలేదని, కేవలం రొటేషన్ పాలసీలో భాగంగానే అతనికి విశ్రాంతినిచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read : పబ్లిసిటీకే రూ. 375 కోట్లా..? రామాయణ కొత్త ట్రెండ్..!

ఈ విషయాన్ని సమర్థిస్తూ దీప్ దాస్ గుప్తా టీమిండియా ఆల్‌ రౌండర్ అక్షర్ పటేల్ ఉదాహరణను తెరపైకి తెచ్చారు. ఇంగ్లాండ్‌ తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అద్భుతంగా రాణించి, ప్రస్తుతం టీం ఇండియా నంబర్ 1 టీ20 స్పిన్నర్‌గా ఉన్న అక్షర్ పటేల్ కూడా జింబాబ్వే సిరీస్‌ లో లేడని, మరి అతని గైర్హాజరీపై ఎవరూ ఎందుకు ప్రశ్నలు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు. ఓపెనింగ్ కాంబినేషన్లను ప్రయోగాల రూపంలో పరీక్షించడానికే సంజు శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ వంటి యువకులకు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారని తెలిపారు.

Also Read : విద్యార్థులపై పెల్లెట్ గన్ లు.. అసలు ఏంటీ తుపాకి కథ..?

అంతేకాని ఇది సంజును పక్కన పెట్టడం కాదని స్పష్టం చేశారు. అయితే, జింబాబ్వే సిరీస్ కంటే ముందు ఇంగ్లాండ్‌ తో జరిగిన సిరీస్‌లో సంజు శాంసన్‌ కు మరిన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఉండాల్సిందని దీప్ దాస్ గుప్తా అభిప్రాయపడ్డారు. రాబోయే పెద్ద టోర్నమెంట్‌ లను దృష్టిలో ఉంచుకుని కనీసం 25 నుండి 30 మంది ఆటగాళ్లకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించడం ఎంతో ముఖ్యమని ఆయన హితవు పలికారు. కాగా, ఈ సిరీస్‌ లో సంజు శాంసన్ స్థానంలో వచ్చిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ రెండు హాఫ్ సెంచరీలతో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్