Wednesday, July 29, 2026 07:40 PM
Wednesday, July 29, 2026 07:40 PM

ఒక్క మాటతో పార్లమెంట్ ను షేక్ చేసిన రాహుల్..!

లోక్‌సభలో యాంటీ-పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చ తీవ్ర ఉద్రిక్తతలకు, అధికార-ప్రతిపక్షాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒక విద్యార్థితో తాను జరిపిన సంభాషణను గుర్తుచేసుకుంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వాడిన ఒక పదం పార్లమెంట్‌ లో పెను తుఫాను సృష్టించింది. సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నిజమైన విద్యార్థులకు, తామే సర్వజ్ఞులమని భ్రమపడే పాలకులకు మధ్య ఉన్న తేడాను వివరించే క్రమంలో ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ క్రమంలో రెండో రకం వ్యక్తులను ఉద్దేశించి ఆయన ఇడియట్ అనే పదాన్ని పదేపదే ఉపయోగించారు.

Also Read : పబ్లిసిటీకే రూ. 375 కోట్లా..? రామాయణ కొత్త ట్రెండ్..!

దీనిపై ట్రెజరీ బెంచీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జోక్యం చేసుకుని, రాహుల్ విద్యార్థుల పేరు చెప్పి అన్‌ పార్లమెంటరీ పదజాలం వాడుతున్నారని మండిపడ్డారు. దాంతో స్పీకర్ ఓం బిర్లా ఆ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించారు. ఈ వివాదం సద్దుమణగక ముందే, రాహుల్ గాంధీ దేశ విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందే ఆరెస్సెస్ అంటూ నేరుగా దాడికి దిగారు. “ప్రస్తుతం దేశంలో విద్యాశాఖను నడుపుతోంది మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాదు, వెనుక ఉండి నడిపిస్తోంది ఆరెస్సెస్ శక్తులే” అని ఆరోపించారు.

విద్యార్థులను నిజమైన జ్ఞానాన్ని అన్వేషించనివ్వకుండా, ఆరెస్సెస్ తమ కల్పిత చరిత్రను వారిపై బలవంతంగా రుద్దుతోందని ధ్వజమెత్తారు. ఇటీవల విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసు లాఠీచార్జ్, దాడుల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారని, ఆయనే స్వయంగా విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఇచ్చారని రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, పార్లమెంట్‌ లో ఈ విషయంపై మాట్లాడే ధైర్యం లేకనే అమిత్ షా సభకు రాలేదని ఎద్దేవా చేశారు.

Also Read : విద్యార్థులపై పెల్లెట్ గన్ లు.. అసలు ఏంటీ తుపాకి కథ..?

దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందిస్తూ, ఎలాంటి ఆధారాలు లేకుండా హోంమంత్రిపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని, రాహుల్ గాంధీ సభకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ కూడా ఆధారాలు లేకుండా మంత్రులపై ఆరోపణలు చేయవద్దని రాహుల్‌ను హెచ్చరించినప్పటికీ, విద్యార్థులపై అంతటి బలప్రయోగానికి హోంమంత్రి కాకుండా మరెవరు ఆదేశాలిస్తారంటూ రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలకు కట్టుబడ్డారు. ఈ పరిణామాలతో పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి పొలిటికల్ వార్ నడిచింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వంగవీటి రాధా రాజకీయ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి అనే పేరుకు...

నేనేంటో నా భర్తకు...

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా...

జనసేన సంచలన నిర్ణయం.....

ఏపీలో అధికారంలో ఉన్న జనసేన పార్టీ...

కాపులను రెచ్చగొడుతున్న వైసీపీ.....

రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కాపుల చుట్టూ...

మరో మాజీ మంత్రి...

వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం...

అల్లు అర్జున్ సంచలన...

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్...

పోల్స్