ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి, విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం ఆసక్తిని రేపుతోంది. తాజాగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విసిరిన బహిరంగ సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఈ సవాల్ పై నెటిజన్లు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుండి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. జగన్ ఈ సవాల్‌ను స్వీకరిస్తారా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.
Also Read : కేంద్రానికి సీజేపి మరో డెడ్ లైన్..!
పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ భేటీలో మంత్రి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై, జగన్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హితవు పలికిన లోకేష్, డీఎస్సీ నిర్వహణ, విద్యాశాఖలో తాము తీసుకొస్తున్న సంస్కరణలపై జగన్‌తో ఎక్కడైనా, ఏ వేదిక మీదనైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.
Also Read : మారుతి బ్రెజ్జా ఫేస్ లిఫ్ట్ రివ్యూ అదుర్స్.. ధర ఎంతంటే..?
ఈ చర్చ కేవలం డీఎస్సీకి మాత్రమే పరిమితం కాదని, గత ఐదేళ్ల వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన దారుణాలను కూడా ప్రజల ముందు ఉంచుతామని లోకేష్ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్, భూ కుంభకోణాలు, ఇసుక దోపిడీలపై కూడా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో జరిగిన దోపిడీని, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమాన్ని పక్కపక్కన పెట్టి చూపిస్తామని చెప్పారు. టీడీపీ ఎప్పుడూ అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన సిద్ధాంతంగా పనిచేస్తుందని లోకేష్ ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

